2024లో టీడీపీ - జ‌నసేన - బీజేపీ - బీఎస్పీ పొత్తు... 3 ఫార్ములాలు ఇవే..!

VUYYURU SUBHASH
ఎన్నిక‌ల‌కు ఇంకా.. రెండున్న‌రేళ్లు స‌మ‌యం ఉందికదా.. ఇప్పుడే ఎందుకు ఈ చ‌ర్చ‌లు అంటున్నారా?  ఈ చ‌ర్చ ఎక్క‌డో ఎవ‌రో చేయ‌డం లేదు. సాక్షాత్తూ టీడీపీలోనే జ‌రుగుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎన్ని సీట్ల‌లో మ‌నం పోటీ చేస్తున్నాం? ఎన్ని మ‌నోళ్ల‌కు ద‌క్కుతాయి? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది. ఏ ఇద్ద‌రు సీనియ‌ర్లు ఫోన్ చేసి మాట్లాడుకున్నా.. ఇదే విష‌యంపై చ‌ర్చించుకుంటు న్నారు. ఎందుకంటే.. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ ఒంట‌రిగా పోటీ చేసింది. దీంతో 175 స్థానాల్లోనూ అభ్య‌ర్థుల‌ను నిల‌బెట్టింది. గెలిచిన వారు గెలిచారు.. ఓడిన వారుఓడారు. స‌రే.. 2014 విష‌యానికి వ‌స్తే.. బీజేపీతో పొత్తు పెట్టుకుని టీడీపీ పోటీ చేసింది. అయితే.. ఆ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన కూడా మ‌ద్ద‌తు ఇచ్చింది. కానీ, ఈ పార్టీ కొత్త‌గా పుట్టిన నేప‌థ్యంలో పోటీకి దూరంగా ఉంది.

దీంతో బీజేపీకి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని స్థానాలు కేటాయించిన టీడీపీ.. మిగిలిన వాటిలో పోటీ చేసింది. అయితే.. ఇప్పుడు ప‌రిస్థితి మారుతోంది. వ‌చ్చే ఎన్నిక‌లు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా మార‌నున్నాయి. ముఖ్యంగా అసెంబ్లీలో చంద్ర‌బాబు శ‌ప‌థం చేసి మ‌రీ బ‌య‌ట‌కు వ‌చ్చారు. తాను ముఖ్య‌మంత్రిగానే మ‌ళ్లీ స‌భ‌లోకి అడుగు పెడ‌తాన‌ని ఆయ‌న అన్నారు. ఈ క్ర‌మంలో గెలిచి తీరాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. అలాగ‌ని .. ఒంట‌రి పోరుతో ముందుకు సాగితే.. కోరి క‌ష్టాలు కొని తెచ్చుకున్న‌ట్టే అవుతుంది. ఈ క్ర‌మంలో ఇప్ప‌టి నుంచే పొత్తుల‌పై తీవ్ర‌స్థాయిలో చ‌ర్చ‌కు జ‌రుగుతున్నాయ‌ని ఇవ‌న్నీ అంత‌ర్గ‌తంగా అత్యంత గోప్యంగా సాగుతున్నాయ‌ని అంటున్నారు. అంటే.. వ‌చ్చే ఎన్నిక‌లు మ‌హాకూట‌మిగా ముందుకు సాగేందుకు పార్టీలు రెడీ అయ్యాయి.

దీనిని బ‌ట్టి జ‌న‌సేన‌-టీడీపీ-బీజేపీ పొత్తు దాదాపు ఖ‌రారు అయింద‌నే భావ‌న టీడీపీ నేత‌ల్లో వినిపిస్తోంది. ఈ క్ర‌మంలో ఈ మూడు పార్టీల‌కు తోడు.. బీఎస్పీ వంటివి కూడా జ‌త‌య్యే అవ‌కాశం ఉంది. దీంతో ఉన్న 175 స్థానాల‌ను అంద‌రూ పంచుకోవాల్సి ఉంటుం ది. సో.. టీడీపీ ప్ర‌ధాన పార్టీగా ఉంటుంది క‌నుక‌.. ఎక్కువ సీట్ల‌లో పోటీ చేసే అవ‌కాశం ఉంది. జ‌నసేన కొద్దిగా త‌గ్గించుకునే ఛాన్స్ ఉంది. ఇక‌, బీజేపీ మ‌రింత‌గా త‌గ్గించుకునే అవ‌కాశం ఉంది. ఇక‌, బీఎస్పీ వంటివాటికి కూడా బ‌ల‌మైన స్థానాల్లో ఒక‌టి రెండు స్థానాలు కేటాయించే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు టీడీపీ నేత‌లు చెబుతున్న మాట‌ల‌ను బ‌ట్టి.. సీట్ల షేరింగ్ రెండు ర‌కాలుగా ఉంటుంద‌ని అంటున్నారు.
షేరింగ్-1(టీడీపీ+జ‌న‌సేన‌+బీజేపీ+ఇత‌రులు)
టీడీపీ - 100 సీట్లు
జ‌న‌సేన - 50
బీజేపీ - 20
బీఎస్పీ+ఇత‌రులు - 5

షేరింగ్-2(టీడీపీ+జ‌న‌సేన‌+ఇత‌రులు)
టీడీపీ - 105 సీట్లు
జ‌న‌సేన - 65
బీఎస్పీ+ఇత‌రులు - 5

షేరింగ్-3(టీడీపీ+జ‌న‌సేన‌)
టీడీపీ - 105 సీట్లు
జ‌న‌సేన - 70

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: