సిక్కోలులో ఫిఫ్టీ-ఫిఫ్టీ...లీడ్‌లోకి వచ్చేది ఎవరు?
అయితే మిగిలిన ప్రతి జిల్లాకు టీడీపీకి ముఖ్యమనే చెప్పాలి. ఇక వాటిల్లో శ్రీకాకుళం టీడీపీకి ఎంత ముఖ్యమో చెప్పాల్సిన పని లేదు. ఈ జిల్లా మొదట నుంచి టీడీపీకి అనుకూలమైన జిల్లానే...2014లో కూడా ఈ జిల్లాలో టీడీపీ ఆధిక్యం సాధించింది..జిల్లాలో 10 సీట్లు ఉంటే టీడీపీ 7 సీట్లు గెలుచుకోగా, వైసీపీ 3 సీట్లు గెలుచుకుంది...కానీ 2019 ఎన్నికల్లో టీడీపీ 2 సీట్లు గెలుచుకుంటే...వైసీపీ 8 సీట్లు గెలుచుకుంది.
ఇక నెక్స్ట్ ఎన్నికల్లో సిక్కోలులో టీడీపీ లీడ్ తెచ్చుకోవడం చాలా ముఖ్యం. ఇప్పటికే జిల్లాలో పలువురు నేతలు ఆ దిశగానే పనిచేస్తున్నారు. రెండున్నర ఏళ్లలో సిక్కోలులో పార్టీ చాలావరకు పికప్ అయినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం సిక్కోలులో ఉన్న రాజకీయ పరిస్తితులని గమనిస్తే..వైసీపీ-టీడీపీల మధ్య పోటాపోటి వాతావరణం ఉందని తెలుస్తోంది.
గత ఎన్నికల మీద పోలిస్తే టీడీపీ కాస్త బలం పెంచుకోగా, వైసీపీ బలం కాస్త తగ్గింది...అలా అని వైసీపీ బలం పూర్తిగా తగ్గిపోలేదు. కానీ టీడీపీ ఢీ అంటే ఢీ అంటుంది. జిల్లాలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్తితులని చూస్తే...10 సీట్లలో 4 చోట్ల వైసీపీకి ఇంకా లీడింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే టీడీపీ కూడా 4 చోట్ల లీడ్‌లోకి వచ్చిందని తెలుస్తోంది. ఇక 2 నియోజకవర్గాల్లో టీడీపీ-వైసీపీల మధ్య నువ్వా-నేనా అన్నట్లు వాతావరణం ఉందట. మరి వచ్చే ఎన్నికలనాటికి జిల్లాలో ఏ పార్టీ లీడ్‌లోకి వస్తుందో చూడాలి.