పోరాడుతున్న వరుణ్ సింగ్..ప్రస్తుతం ఆ లేఖ వైరల్..!
ఇదిలా ఉండగా.. వరుణ్‌సింగ్ గతంలో ఓ లేఖ రాసాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారినది రాసిన లేఖ. హర్యానాలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్‌కు సెప్టెంబర్‌లో లేఖ రాసినట్టు తెలుస్తున్నది. తాము సాధారణమని భావించే విద్యార్థులలో ప్రేరణ నింపడానికే ఆ లేఖ రాసినట్టు వరుణ్‌సింగ్ పేర్కొన్నారు. తమిళనాడు హెలికాప్టర్ దుర్ఘటన జరిగిన తరువాత ఇప్పుడు వరుణ్‌సింగ్ చికిత్స పొందుతున్న తరుణంలో వరుణ్ లేఖ వైరల్ అవుతుంది. వరుణ్ లేఖ చదివిన వారందరూ తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు.
ముఖ్యంగా మీలక్ష్యం ఏమిటో మీరు గుర్తించండి అని.. దేని కోసం పని చేసినా.. మీ వంతుగా కృషి చేయండి అని.. ఎప్పుడూ మీ లో ఉన్న ఆశను, ఆత్మవిశ్వాసాన్ని మాత్రం వీడవద్దు అని.. జీవించాలనే ఆశతో మృత్యువుతో వీరోచితంగా పోరాడుతున్న గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ మనస్సు నుంచి వచ్చిన మాటలు ఇవి. తాను ఎంచుకున్న వృత్తిలో రాణించే వరకు ఆయనకు కూడా ఓ సాధారణ విద్యార్థినే. అద్భుతమైన విజయవాలు వరుణ్‌కు అయాచితంగా రాలేదు.
చదువులో చాలా సాధారణ విద్యార్థి వరుణ్‌సింగ్, 12వ తరగతిలో పస్ట్ డివిజన్ మాత్రమే పొందారు ఆయన. చదువు ఒక్కటే కాదు.. ఆటలు, ఇతర కార్యక్రమాలు కూడా అంతా చరుకు అయిన విద్యార్థి కాదట. విమానాలు, విమానయానం గురించి తెలుసుకోవాలి అని మాత్రం ఆసక్తి.. కానీ అవన్నీ సాధ్యం అవుతాయా అనే భావన వరుణ్‌లో ఉండేదట. ఎప్పుడైతే ప్లైట్ స్క్వాడ్రన్‌లో యంగ్ ప్లైట్ లెప్టినెంట్‌గా ఎంపికయ్యారో.. అప్పటి నుంచి ఆయన ఆలోచనే మారిపోయినది. మనస్సు పెట్టి.. ఏకాగ్రత, ఆత్మవిశ్వాసంతో పని చేస్తే.. గొప్పగా పని చేయగలను అని అర్థమైంది వరుణ్‌కు. ఈ విషయాలను వరుణ్ తన లేఖలో కూడా పేర్కొన్నారు.
ఛాలెంజింగ్ ఫ్లయింగ్ ఇన్‌స్ట్రక్టర్స్ కోర్సులో రెండు ట్రోపీలను గెలుచుకున్న వరుణ్ కేరీర్‌లో వెను తిరిగి చూడలేదని, తేజస్ ఫైటర్ స్క్వాడ్రన్‌లో పోస్టింగ్ పొందడంలో ఆయనలో ఉన్న విశ్వాసాన్ని పెంచింనదట. అదేవిధంగా ఇస్రో చరిత్రలో మేకింగ్ గగన్‌యాన్ ప్రోగ్రామ్ కోసం 12 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాలో కూడా చోటు దక్కించుకున్నారంటే వరుణ్‌సింగ్ ఎంత ప్రతిభ కనబరిచారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. టెంత్ క్లాస్, ఇంటర్ మార్కులు ప్రాతిపాదిక కాదని, మీ మార్కులు మీ జీవితాన్ని శాసించలేవు అని వరుణ్‌సింగ్ తన లేఖలో పేర్కొన్న అంశాలు ఇప్పుడు ప్రస్తుతం కోట్లాది మంది యువతను ఆలోచింపజేస్తున్నాయి.