ప్రతి రంగంలోనూ భారతదేశంలో మొదటి ర్యాంకు లో తెలంగాణ రాష్ట్రం ఉందని మంత్రులు, శాసన సభ్యులు పదే పదే ప్రకటిస్తూ ఉంటారు. రైతు బంధు అమలు చేయడంలో, 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా, రైతు బీమా వంటి అనేక పథకా లను ఇందుకు ఉదాహరణగా చెబుతుంటారు. ఇటీవల దళితుల కోసం ప్రత్యేక పథకాన్ని "దళిత బంధు" పేరుతో హుజురాబాద్ ఎన్నికల సందర్భంగా ప్రారంభించినట్లే ప్రారంభించి అర్ధాంతరంగా ఆపేసింది. హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితం ప్రకటించిన తర్వాత నవంబర్ 4వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ దళిత బంధు ధగా 35 వ రోజులు గడుస్తున్నా, ఈ విషయంలో కూడా భారత దేశంలో తొలి రాంకులో ఉన్నట్టే నా..? అలాగే వరి ధాన్యం కొనుగోలు విషయంలో తాత్సారం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై పోరాటం చేయడం ద్వారా ప్రజల దృష్టిని మళ్ళిస్తుంది.
వరికుప్పల పైన, కల్లాలలో రైతులు నెలకు పైగా కొనుగోలు జరగక పోవడంతో ఆవేదనతో గుండె ఆగి అనారోగ్యంతో ఇప్పటికే ఆరుగురు రైతులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. అయినా ఆ విషయంలో ప్రభుత్వం చలనం లేదు. ఎస్సీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా రుణ సౌకర్యం కోసం దరఖాస్తు చేసుకున్న వేలాదిమంది అప్లికేషన్లు పరిష్కరించి రుణ మంజూరు చేసిన దాఖలాలు లేవు.. మరొకవైపు రహదారుల దుస్థితి తొలి ర్యాంకులో ఉన్నదంటే ఆశ్చర్యపోనక్కర లేదు. మద్యం దుకాణాలను విచ్చల విడిగా పెంచి అందులో రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణను భావించవచ్చునేమో..! ప్రకృతి గుట్టల విధ్వంసాన్ని హామీ ఇచ్చిన తెరాస పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విచ్చలవిడిగా గుట్టలు కరిగి పోతున్నవి. ఇలా రాష్ట్రంలో రోజు రోజుకు వారి రాజకీయ విలువలు తగ్గుతూ పేదల పేదవాడి గానే, ధనవంతుడు ఇంకా పెరిగిపోతూనే ఉన్నారు.