ఎన్టీఆర్ రోశయ్యకు భయపడే అలా చేశారా ?
పైగా ఎన్టీఆర్ నటించిన పౌరాణిక సినిమాలు అంటే రోశయ్యకు ఎంతో ఇష్టం. ఎన్టీఆర్ నటించిన అన్ని సినిమాలు రోశయ్యఎంతో ఇష్టంతో చూసేవారట. అయితే రాజకీయంగా మాత్రం వీరి మధ్య వైరుధ్య భావన అలాగే కొనసాగింది. రోశయ్యకు ఆర్థిక మంత్రి హోదాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 15 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత దక్కింది. ఆయన బడ్జెట్ ప్రవేశ పెడుతున్నంతసేపు ఏ ఎమ్మెల్యే కూడా సభ నుంచి బయటకు వెళ్లేందుకు ఇష్టపడేవారు కాదట. ఆయన ఏం చెబుతున్నారో చాలా శ్రద్ధగా ఆలకించే వారట.
ఇక రోశయ్య రాజకీయ జీవితం 1967లో ఎమ్మెల్సీగా ప్రారంభం అయింది. చివరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్సీ గానే ఉన్నారు. ఆయన రెండు సార్లు మాత్రమే శాసనసభకు ఎంపికయ్యారు. 1989లో తెనాలి నుంచి , 2004 నుంచి చీరాల నుంచి మాత్రమే ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక ఎన్టీఆర్ పార్టీ పెట్టిన కొత్తలో శాసనమండలిలో రోశయ్య ఎన్టీఆర్ కు, తెలుగుదేశం పార్టీకి తన వాగ్దాటితో చుక్కలు చూపించేవారట.
ఎన్టీ రామారావు కేవలం రోశయ్య దెబ్బకు తట్టుకోలేకే శాసనమండలిని రద్దు చేశారని అప్పట్లో ఒక టాక్ బయటకు వచ్చింది. పైకి మాత్రమే ఎన్టీఆర్ శాసన మండలి వల్ల ప్రజాధనం వృథా అవుతుందని చెప్పినా... అసలు కారణం మాత్రం రోశయ్యను తట్టుకోలేకే అని అప్పుడు కొందరు రాజకీయ మేధావులు తమ చర్చల్లో చెప్పేవారు.