
ముఖ్యమంత్రి కేసీఆర్... ముసుగులో ఉన్న ఒక స్మగ్లర్ !
ముఖ్యమంత్రి కేసీఆర్ ముసుగులో ఉన్న ఒక స్మగ్లర్ అని ఫైర్ అయ్యారు ధర్మపురి అరవింద్. తెలంగాణ కు కేంద్రం ఏం చేయడం లేదు, అందులో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు గురించి ప్రస్తావన చేస్తాడని... రాష్ట్ర ప్రభుత్వం 2014 నుంచి ఇప్పటి వరకు స్థల కేటాయింపు జరగలేదని నిప్పులు చెరిగారు. రీ సైకిల్ బియ్యాన్ని టీఆర్ఎస్ నేతలు ఎఫ్.సి.ఐ కి అమ్ముతున్నారని... కర్నాటక నుండి తక్కువ నాణ్యత గల బియ్యాన్ని తెచ్చి స్మగ్లింగ్ కు పాల్పడుతూ వేల కోట్లు సంపాదిస్తున్నారని ఓ రేంజ్ లో రెచ్చి పోయారు. టీఆర్ఎస్ అండదండలతో మిల్లర్లు ఎక్కువ తరుగు తీసి రైతులకు అన్యాయం చేస్తున్నారని... ముఖ్యమంత్రి కేసీఆర్ ముసుగులో ఉన్న ఒక స్మగ్లర్. తెలంగాణ లో పండే నాణ్యమైన బియ్యాన్ని ప్రైవేటుగా రైస్ మిల్లర్లకు అమ్ముతూ డబ్బులు సంపాదిస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీలు దళిత బంధు గురించి మాట్లాడకుండా ఎదురుదాడి చేస్తున్నారన్నారు. కేసీఆర్ కేంద్ర మంత్రుల పై మాట్లాడుతున్న భాష దుబాయి శేఖర్ లాగా ఉందని ఫైర్ అయ్యారు. కేసీఆర్ ప్రెస్ మీట్లకు సెన్సార్ బోర్డ్ 18ప్లస్ రేటింగ్ ఇవ్వాలి. తెలంగాణ సమాజం సిగ్గుపడేలా కేసీఆర్ భాష ఉందని... వాస్తవాలు తెలుసుకోకుండా ఎవరో ఇచ్చిన సమాచారాన్ని కేసీఆర్ మీడియాతో మాట్లాడుతున్నాడని నిప్పులు చెరిగారు. తెలంగాణ లో భూముల ధరలు పెరగడంలో కేసీఆర్ గొప్పతనం లేదు. అలాంటప్పుడు ప్రభుత్వ భూములు ఎందుకు అమ్ముతున్నారు? 2014 నుంచి సీఎం కేసీఆర్ ఏ పంటకు బోనస్ ఇచ్చారు? ఏ పంటలను వేయమని ప్రోత్సాహించాడు ? అని నిలదీశారు. గతంలో మొక్కజొన్న, సోయాబీన్ పండించే రైతులను సన్న వడ్లు పండించమని కేసీఆర్ కోరలేదా? కేసీఆర్ మీడీయా సమావేశాలు అడల్ట్ సినిమాలను తలిపిస్తున్నాయని ఫైర్ అయ్యారు.