వ్యవస్థల మధ్య.. సంఘర్షణ..!

Chandrasekhar Reddy
దేశంలో ఆయా వ్యవస్థల మధ్య సంఘర్షణలు చోటుచేసుకుంటున్న విషయం ఇటీవల గమనిస్తూనే ఉన్నాం. ముఖ్యంగా న్యాయవ్యవస్థ కు, శాసనవ్యవస్థల మధ్య ఈ సంఘర్షణ నెలకొంటుంది. న్యాయవ్యవస్థలో ఉన్నవారు కొన్ని పరిధులలో ఉండి పని చేస్తున్నప్పటికీ, వ్యవస్థలో లోపాలను ఎత్తిచూపడం లాంటివి చేయడం కూడా వారికి వర్తిస్తుంది. అయితే అది పౌరులుగా చేస్తున్నారనేది వాళ్ళ అభిమతం కావచ్చు కానీ, చూసే వారికి మాత్రం వారి పదవి బట్టి వ్యాఖ్య చేస్తున్నట్టు భావిస్తారు. సాధారణ ప్రజలకు అదే అనిపిస్తుంది. ఒక జడ్జి ఏదైనా విషయంపై స్పందిస్తే, అది ఒక పౌరుడు చేసినట్టుగా భావించడం సమాజంలో కుదరదు, కేవలం ఒక జడ్జి అభిప్రాయం వ్యక్తం చేసినట్టుగానే గమనిస్తారు.
ఈ చిన్న మరియు సున్నితమైన విషయం న్యాయమూర్తుల కు వర్తిస్తుంది కాబట్టి వారు ఈవిషయంపై స్పందించినా దానిపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. వీళ్లు పౌరులే కావచ్చుగాక, కానీ పదవిని బట్టి వాళ్లకు సమాజంలో ఒక స్థానం ఇవ్వడం జరిగింది, అందులో ఉన్నంత కాలం వారు ఏవిధమైన వ్యాఖ్యలు చేసినప్పటికీ అవన్నీ ఆ పదవి ని బట్టే గమనిస్తారు తప్ప, వ్యక్తిగతం అని అర్ధం చేసుకోవడం చాలా కష్టం. ఇది న్యాయమూర్తుల విషయంలోనే కాదు, ఉన్నత పదవులలో ఉన్న ప్రతి వారికి వర్తిస్తుంది. ఆయా పదవులను బట్టే వారు ప్రవర్తించాల్సి ఉంటుంది. అది మరిచిపోతే, వారి వ్యాఖ్యలు భిన్న అర్దాలుగా ప్రజలలోకి వెళ్లే ప్రమాదం ఉంది.
ఇలా తప్పుడు సంకేతాలు న్యాయవ్యవస్థ నుండి వెళితే అది వ్యవస్థపై నమ్మకాన్ని సడలించే ప్రమాదానికి దారితీస్తుంది. ఒకవేళ వీరు శాసన వ్యవస్థ గురించి ఏదైనా అంటే, ఆ వ్యవస్థపై ప్రజలలో నమ్మకం సడలే ప్రమాదం ఉంది. అందుకే వారు ఆచితూచి స్పందించాల్సి ఉంటుంది. ఆయా వ్యవస్థలలో లోపాలు ఉన్నట్టే న్యాయవ్యవస్థలో లోపాలు ఉన్నాయని అందులో సేవలు అందిస్తున్న వారికీ తెలుసు, అందుకే వాటిని సరిచేసుకోవాల్సిన బాధ్యత తమదే. ఒకవేళ శాసనవ్యవస్థ తో ఆయా లోపల సవరణ సాధ్యపడాలి అని నిబంధన ఉంటె, ఆ విధంగా ఆ వ్యవస్థకు సిఫార్సు చేయడం ద్వారా కావాల్సిన మార్పులు చేసుకోవచ్చు. అంతేకాని, కేవలం విమర్శలు సరికాదని తాజాగా రాష్ట్రప్రతి కూడా న్యాయవ్యవస్థపై స్పందించిన విషయం తెలిసిందే. బహుశా తమ వ్యవస్థలో లోపాలను ప్రజలకు తెలియపరచడం న్యాయవ్యవస్థ అభిమతం కావచ్చుగాక.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: