జగనన్న: ఆయనను పెద్దాయన అని పిలిచారే ! ఎందుకు?
ఈ నేపథ్యంలో ఈ తరుణంలో
చాలా రోజులుగా జగన్ అనే సీఎం తన స్థాయిని పెంచుకునే రీతిలో ప్రవర్తించారు. తన స్థాయిని చూసి ఇతరులు ఆనందించేలా ప్రవర్తించారు జగన్. ఓవిధంగా ప్రతిపక్షం విస్తుబోయేలా ప్రవర్తించి మహానేత కు తగ్గ తనయుడిగా మంచి పేరే తెచ్చుకున్నారు. వెరీగుడ్ సర్.. అని చాలా మంది అంటున్నారిప్పుడు. అవును! మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బీఏసీ నిర్వహించారు. ఇందులో సభలో అనుసరించాల్సిన వ్యూహం, ఇంకా చెప్పాలంటే సెషన్ కు సంబంధించిన బిజినెస్ ఇలా చాలా విషయాలు చర్చించేందుకు ఎప్పటిలానే బిజినెస్ అడ్వైజరీ కమిటీ భేటీ అయింది. ఈ సందర్భంగా అచ్చెన్నను ఆయన పెద్దాయన అని సంబోధించారు. సభ ఒక్కరోజు ఎలా నిర్వహిస్తారు అని ప్రశ్నించిన అచ్చెన్నకు సావధానంగానే సమాధానం ఇచ్చారు. ఒక్క రోజు కాదు ఏడురోజులు సెషన్ నిర్వహిద్దాం అని చెప్పి ప్రతిపక్ష నేతకు (అచ్చెన్న - టీడీపీకి సంబంధించి డిప్యూటీ ఫ్లోర్ లీడర్) సర్దిచెప్పారు. అదేవిధంగా ఆయనను సంబోధించేటప్పుడు కానీ ఆయన విషయమై మాట్లాడేటప్పుడు కూడా హుందా తనం చాటుకున్నారు. ఆయన ఎదురయినప్పుడు కూడా అచ్చెన్నా ద గ్రేట్ అని కూడా అన్నారు. ఇవన్నీ సానుకూలాంశాలే!