స్పీకర్ తమ్మినేని సీతారాంకు టీడీపీ ఎమ్మెల్యే లేఖ...
స్త్రీ, పురుషులనే బేధం లేకుండా సభకు పరిచయం లేని వ్యక్తులను కూడా దూషణల్లోకి లాగుతున్నారని ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్. .నిండు శాసన సభలో ఒక స్త్రీ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు వ్యాఖ్యలు చేశారని అగ్రహించారు ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్. సభలో లేని, సభకు సంబంధం లేని చంద్రబాబు అర్ధాంగి, నారా భువనేశ్వరిపై పాలకపక్ష సభ్యులు చేసిన నిందారోపణలు మహిళల మనోభావాలను తీవ్రంగా కించపరిచినట్లు అయిందని ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్. .
ప్రభుత్వం మాత్రం భువనేశ్వరి గారి పట్ల ఎటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదని బుకాయిస్తోందన్నారు ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్. 19వ తేదీన శాసన సభలో జరిగిన చర్చలు అన్నీ సభాసాంప్రదాయం ప్రకారం రికార్డు చేయబడతాయి... ఆ రికార్డులన్నింటినీ ఎటువంటి వీడియో, ఆడియో ఎడిటింగ్ లేకుండా ప్రజల ముందు ఉంచాలని కోరుతున్నామన్నారు ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్. సభాపతిగా, ఎలాంటి పక్షపాతం లేకుండా, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని.. స్పీకరుకున్న విచక్షణాధికారాలను ఉపయోగించి ఆడియో, వీడియోలను ఎటు వం టి తొ లగిం పుల్లే కుండా బయటపెట్టాలని పేర్కొన్నారు ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్. .