చైనా కొత్త కుట్ర.. అస్సాం టార్గెట్?

praveen
నక్క జిత్తుల మారి చైనా కన్ను ఎప్పుడు పొరుగు దేశమైన భారత్ పైనే ఉంటుంది అన్న విషయం తెలిసిందే. భారత్ వేగంగా వృద్ధి రేటు సాధిస్తూ ఉండడాన్ని చూసి ఓర్వలేని తనం ప్రదర్శిస్తూ ఉంటుంది చైనా. ఈ క్రమంలోనే భారత ప్రజలని  తప్పుదోవ పట్టించే విధంగా ఎప్పుడూ ఏదో ఒక విధంగా కుట్రలు పన్నుతు ఉంటుంది చైనా. ఒకవైపు సరిహద్దుల్లో సైనికులతో ఉద్రిక్త పరిస్థితులు సృష్టించడమే కాదు మరోవైపు భారత దేశంలో ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు ఏదో ఒక విధంగా పెడదోవ పట్టే విధంగా భారీగా కుట్రలు పన్నుతూ ఉంటుంది.

 ఇప్పటికే ఈశాన్య రాష్ట్రాలను టార్గెట్గా చేసుకుని చైనా ఎన్నో దారుణాలకు పాల్పడింది అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు అస్సాం ను టార్గెట్ గా చేసుకుని అక్కడి ప్రజలందరిని కూడా తనవైపు తిప్పుకొని ఎన్నో నేరాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇటీవలే అస్సాంలో ఒక కొత్త  వ్యవహారానికి చైనా తెరలేపింది అన్న విషయం బయటపడింది. అస్సాంలో నార్కో జిహాద్ ప్రారంభించింది చైనా. దేశాన్ని మొత్తం ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్న డ్రగ్ మాఫియా ని  గుర్తించేందుకు ప్రస్తుతం అస్సాం ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

 ఈ క్రమంలోనేఇటీవలే కరీం గంజ్ జిల్లాలోని రాతవారి పోలీస్ స్టేషన్ పరిధిలో.. నార్కోటిక్స్ అధికారుల బృందం భారీ ఎత్తున నిషేధిత వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. బుర్హనుద్దీన్ అనే వ్యక్తి దగ్గర నుంచిమూడు కోట్ల రూపాయల విలువైన ఎటువంటి లక్ష వైఎబిఎ టాబ్లెట్ ను స్వాధీనం చేసుకుందిడ్రగ్స్ వ్యాపారి  ఇన్నోవా కారులో వెళ్తున్న సమయంలో పక్కా సమాచారంతో దాడులు నిర్వహించిన అధికారులు ఇక ఈ డ్రగ్స్ మాఫియాను  పట్టుకున్నట్లు తెలుస్తోంది. మరో ఘటనలో సోనా ముఠాకు సంబంధించి నటువంటి మరో ముఠా ను 7 కిలోల గంజాయి తో పాటుగా భారీగా నిషేధిత టాబ్లెట్లను  కూడా పట్టుకున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: