పార్టీలో జోష్ తెచ్చేందుకు బాబు కొత్త ఎత్తుగ‌డ ఇదే..!

VUYYURU SUBHASH
టీడీపీ అధినేత‌, మాజీ సీఎం చంద్ర‌బాబు నాయుడు ఒక‌టి కాదు రెండు కాదు 40 ఏళ్ల నుంచి రాజ‌కీయాల్లో ఉంటూ వ‌స్తున్నారు. ఆయ‌న సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు. ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా ఆయన ఎంతో కాలం రాష్ట్రానికి సేవలందించారు. ఉమ్మ‌డి ఆంధ్ర ప్ర‌దేశ్‌కు 9 సంవ‌త్స‌రాలు, ఆ త‌ర్వాత విభ‌జిత ఏపీకి తొలి సీఎం గా 5 సంవ‌త్స‌రాలు ముఖ్య‌మంత్రి గా ఉండ‌డం అంటే మామూలు విష‌యం కాదు.

అలాంటి చంద్ర‌బాబు మారుతోన్న రాజ‌కీయ ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఇప్పుడు పూర్తిగా నైరాశ్యంలో ఉన్నారు. నిన్న అసెంబ్లీ లో జ‌రిగిన ప‌రిణామాల నేప‌థ్యంలో ఆయ‌న క‌న్నీళ్లు పెట్టుకున్నారు. చివ‌ర‌కు ముఖ్యమంత్రిగానే సభలో అడుగు పెడతానని భీష్మ‌ ప్రతిజ్ఞ చేశారు. పార్టీ ఎంతో క‌ష్టాల్లో ఉన్న నేప‌థ్యంలో బాబు మ‌ళ్లీ పార్టికి జ‌వ‌స‌త్వాలు తెచ్చేందుకు ఆయ‌న వేసే కొత్త‌ రాజకీయ ఎత్తుగడలు ఎలా ఉండబోతున్నాయి ? శాసనసభకు రాకుండా ఆయన ప్రజల్లోకి ఎలా వెళ‌తారు ? అన్న‌దే ఇప్పుడు చ‌ర్చ‌నీయాం శంగా మారింది.

బాబు వ‌య‌స్సు ఇప్ప‌టికే 72 సంవ‌త్స‌రాలు. 2024 ఎన్నిక‌ల‌కు మ‌రో రెండేళ్ల టైం మాత్ర మే ఉంది. 2009 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన మీకోసం పేరుతో చేప‌ట్టిన పాదయాత్ర పార్టీకి జ‌వ‌స‌త్వాలు నింపింది. బాబు 2013 లోనే మొత్తం 2,340 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. అదే ఆయ‌న 2014లో అధికారంలోకి రావ‌డానికి కార‌ణ‌మైంది. ఈ క్ర‌మంలోనే బాబు ఇప్పుడు మ‌రోసారి పాద‌యాత్ర కు రెడీ అవుతున్న‌ట్టే తెలుస్తోంది.

బాబు ఈ సారి తిరుపతి నుంచి మొదలు పెట్టి ఇచ్చాపురం వరకూ పాదయాత్ర చేయాలన్నది ల‌క్ష్యంగా పెట్టుకున్నార‌ట‌. రాష్ట్రం లోని అన్ని జిల్లాలు క‌వ‌ర్ అయ్యేలా ఈ యాత్ర ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. పార్టీ మ‌ళ్లీ ఎలా అయినా గెల‌వాలంటే పాద‌యాత్ర కు మించిన ఆయుధం మ‌రొక‌టి ఉండ‌ద‌నే అంటున్నారు. అయితే ఎన్నిక‌ల‌కు ఇంకా టైం ఉన్న నేప‌థ్యంలో ఇప్పుడే పాద‌యాత్ర చేయ‌డ‌మా ?  లేదా కొద్ది రోజులు ఆగి చేయ‌డ‌మా ? అన్న‌ది మాత్రం ఇంకా క్లారిటీ లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: