టీడీపీ-జనసేన కాంబో కొంపముంచేలా ఉందిగా!
కాబట్టి 2024 ఎన్నికల్లో ఏం చేస్తే ఉపయోగం ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. అయితే బాబు-పవన్‌లు ఆ దిశగానే పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే వైసీపీ అధికారంలోకి వచ్చాక...టీడీపీకి చుక్కలు కనబడుతున్నాయి. రాజకీయంగానే కాకుండా వ్యక్తిగతంగా చంద్రబాబు అనేక అవమానాలు ఎదురవుతున్నాయి. అటు పవన్‌ని కూడా వైసీపీ వదిలిపెట్టడం లేదు. ఆయనకు చుక్కలు చూపిస్తున్నారు.
ఇలాంటి పరిస్తితుల్లో టీడీపీ-జనసేనలు కలిసి వైసీపీకి చెక్ పెట్టాల్సిన అవసరముంది. అయితే పైనున్న నాయకులు ఇంకా దీనిపై తేల్చుకోలేకపోయిన కింది స్థాయిలో ఉన్న టీడీపీ, జనసేన నేతలు మాత్రం కలిసికట్టుగా వైసీపీకి చెక్ పెట్టేందుకు పనిచేస్తున్నారు. ఇప్పటికే పలుచోట్ల కలిసి పనిచేశారు. తాజాగా కూడా కొన్ని చోట్ల కలిసి బరిలో దిగారు. ఆకివీడు నగర పంచాయితీలో టీడీపీ-జనసేనలు కలిసి పోటీ చేసి వైసీపీకి గట్టి పోటీ ఇచ్చాయి. ఓడిపోయినా సరే పోటీ మాత్రం ఇచ్చాయి. అలాగే పలు ఎంపీటీసీ స్థానాలని కూడా కలిసి గెలిచారు.
అంటే టీడీపీ-జనసేన కాంబినేషన్ వల్ల వైసీపీకి నష్టమే తప్ప...లాభం లేదని చెప్పొచ్చు. వచ్చే ఎన్నికల్లో ఈ కాంబో వల్ల కొన్ని జిల్లాల్లో వైసీపీకి నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా కోస్తా జిల్లాలో ఈ కాబో చాలా డేంజర్. కాబట్టి ఈ కాంబోపై వైసీపీ జాగ్రత్తగా ఉండాలి...లేదంటే కొంపమునుగుతుంది.