చేయి దాటిపోతున్న పరిస్థితి.. జగన్ రంగంలోకి దిగాల్సిందేనా?

praveen
గత కొన్ని రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీగా వర్షాలు జనజీవనాన్ని స్తంభింపజేస్తున్నాయన్న విషయం తెలిసిందే. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతోప్రస్తుతం ఎన్నో ప్రాంతాలు జలదిగ్బంధంలో కి వెళ్లి పోతున్నాయి. ఇలా ముఖ్యంగా రాయలసీమ కోస్తాంధ్ర జిల్లాల్లో అయితే అతి భారీ వర్షాలు కురుస్తుండటంతో మునుపెన్నడూ చూడని విధంగా భారీగా వరద వస్తుంది అని చెప్పాలి. అక్కడి ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే సాధారణంగా సీఎం జగన్ తుపానులు వచ్చినపుడు స్వయంగా వెళ్లకుండా అధికారులు మంత్రులతో సర్వే నిర్వహించి పరిహారం లాంటివి ఇవ్వడం చేస్తూ ఉంటారు.

అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకృతి బీభత్సం తీవ్ర తీవ్రంగా ఉంది అన్న విషయం తెలిసిందే. కడప కర్నూలు చిత్తూరు జిల్లాలో మునుపెన్నడూ లేనివిధంగా అతి భారీ వర్షాలు కురుస్తుండడంతో పూర్తిగా అన్ని జిల్లాలు కూడా జలదిగ్బంధంలో లోకి వెళ్ళి పోతున్నాయి. దీంతో ప్రజాజీవనం మొత్తం స్తంభించి పోతుంది. కొన్ని ప్రాంతాల ప్రజలు అయితే వరదల ధాటికి తట్టుకోలేక ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి కూడా ఏర్పడింది. అయితే ఇలాంటి పరిణామాల నేపథ్యంలో సీఎం జగన్ నేరుగా రంగంలోకి దిగాల్సి అవసరం ఎంతైనా ఉంది అని అంటున్నారు విశ్లేషకులు.

 ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సెషన్స్ కి డుమ్మా కొట్టి అయినా సరే సీఎం జగన్ వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించాల్సిన అవసరం ఉంది అని అంటున్నారు. ఎందుకంటే వరదల గురించి బాగా తెలిసినటువంటి కృష్ణా గుంటూరు గోదావరి జిల్లాలో ప్రజలు వరదలు వచ్చినప్పుడు దగ్గరలో ఉన్న పునరావాస శిబిరాలను చేరుకోవడం అలవాటు. కానీ రాయలసీమ ప్రజలకు మాత్రం ఇలాంటి వరదలు అస్సలు అలవాటు లేదని.. అంతేకాకుండా మునుపెన్నడూ లేని విధంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో వరద కారణంగా ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అంటున్నారు విశ్లేషకులు. ఈ క్రమంలోనే ప్రస్తుతం వరద బాధితులు అందరికీ కూడా ఆహారం వసతి లాంటివి అందజేయడం ఎంతో ముఖ్యమని దీనికోసం సీఎం రంగంలోకి దిగితే బాగుంటుందని అనుకుంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: