మోడీడి చాలా గొప్ప మనసు: తెలంగాణా మంత్రి
రైతులు ఎదురుచూస్తున్న ఫలితం వచ్చింది అని ఆయన పేర్కొన్నారు. అమరులైన కుటుంబాలను ఆదుకునే భాద్యత కేంద్రం తీసుకోవాలి అని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసారు. రైతు చట్టాల వల్ల బీజేపీ ప్రభుత్వం పలుచన అవుతోందని ఈ నిర్ణయం అని ఆయన వివరించారు. టిఆర్ఎస్ మహాధర్నా సంకేతాలు మోడీ ప్రభుత్వం గ్రహించారు అని అన్నారు. రైతులకు క్షమాపణ చెప్పడం మోడీ గొప్ప మనసును ఒప్పుకుంటున్నాం అని ఆయన తెలిపారు. ఇది ప్రజల విజయం అన్నారు నిరంజన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ జాకీలు పెట్టి లేపినా లెవదు అని ఆయన.
నల్లచట్టాలకు కాంగ్రెస్ పురుడు పోస్తే- పెంచిపోషించింది బీజేపీ అని మండిపడ్డారు. వడ్ల కొనుగోళ్ల పై మా పోరాటం ఆగదని ఈ సందర్భంగా స్పష్టం చేసారు. 2015లో శాంత కుమార్ కమిటీ ని కేంద్రం పరిగణలోకి తీసుకోవాలి అని విజ్ఞప్తి చేసారు. సమగ్ర వ్యవసాయ పధ్ధతిపై కేంద్రం దృష్టి పెట్టాలి అని కోరారు. బాయిల్డ్ రైస్ కేవలం అన్నం తినడానికి మాత్రమే కాదు చాలా ఉపయోగాలు ఉన్నాయి అని అన్నారు ఆయన. కేంద్రం కొత్త టెక్నాలజీని ఉపయోగించడం లేదు అని మండిపడ్డారు. అధికారిక ప్రకటన వచ్చే వరకు మా పోరాటం సాగిస్తాం అని స్పష్టం చేసారు. నిన్న ధర్నా నడిచే సమయంలో కావాలనే ఓ కేంద్ర ప్రభుత్వ అధికారి లీక్ ఇచ్చారు అని ఆయన వ్యాఖ్యలు చేసారు.