దయచేసి వినండి! సమాంతర ప్రభుత్వాలు నడపకండి!
ఎన్నికలు / ఫలితాలు / తరువాత రోజువారీ తగాదాలు/ నువ్వెంత అంటే నువ్వెంత / అని గొడవేసుకోవడాలు..ఇవన్నీ ఎప్పుడూ ఉండేవే! కానీ కొన్ని సార్లయినా ప్రజాస్వామ్యం గెలిచిందని అనుకునేందుకు వీల్లేకుండా కొన్ని ఎన్నికలు చేస్తాయి. కొన్ని సార్లు అస్సలు కోలుకోలేని దెబ్బ తీస్తాయి. ఏమయినా కానివ్వండి కానీ ఈ స్థానిక ఎన్నికలన్నవి రెండు పార్టీలకూ సవాలు అని అనేందుకు వీల్లేకుండా చేశాడు జగన్.
సీమ రాజకీయాలను ప్రత్యేకంగా నడిపించాలన్న తాపత్రయంలో ఉన్నాడు జగన్. అయితే పార్టీకి ఫండ్ ను సమకూర్చే పెద్దన్న పెద్దిరెడ్డి ఉంటుండగా జగన్ మాట కానీ ఆట కానీ కొన్నిసార్లు చెల్లే అవకాశమే లేకుండా చేయాలన్నది పెద్దిరెడ్డి ప్లాన్ కావొచ్చు. కానీ ఇప్పటికైతే పెద్దిరెడ్డిని దూరం పెట్టనూ లేక అలానే వారి అబ్బాయికి మిథున్ రెడ్డినీ దూరం పెట్టలేక అటు ఢిల్లీలో నూ ఇటు గల్లీలోనూ వారికే అధికారంకు సంబంధించి పనులు అప్పగిస్తున్నాడు జగన్. ఇదంతా బాగున్నా కూడా ఇప్పటికే పెద్దిరెడ్డి రాష్ట్రంలో సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నారని, సీఎంను అనేక సార్లు ఢీ కొనేందుకు ట్రై చేశారని టాక్ కూడా ఉంది. ఇదే విధంగా గతంలో సీఎంతో సమానంగా చిన్న సీఎం గా ఉంటూ టీడీపీ ప్రభుత్వాన్ని నడిపి అభాసుపాలయ్యాడు లోకేశ్. ఇప్పుడు కూడా ఇలాంటి తప్పిదాలే రాష్ట్రంలో పునరావృతం అవుతున్నాయి. కనుక కుప్పంలో గెలిచినంత మాత్రాన ప్రపంచాన్ని గెలిచిన విధం కాదు. కానీ అలా అనుకుంటే ఎవ్వరూ ఏం చేయలేం.