ఈఢీ : కేసీఆర్ కు జగన్ తరహా ట్రీట్మెంట్
ఈ నేపథ్యంలో జగన్ ను కాంగ్రెస్ అవమానపర్చిన విధంగానే కేసీఆర్ ను బీజేపీ అవమానపర్చాలని భావిస్తోంది. అందుకు ఈడీ దాడులొక్కటే మార్గం అని పరిష్కారం అని భావిస్తోంది. అదేవిధంగా కేసులు నమోదు చేసి కొద్దికాలం జైల్లో ఉంచితే కేసీఆర్ దార్లోకి వస్తాడని కూడా భావిస్తోంది. ఒకవేళ ఎన్నికల ముందే కేసీఆర్ పాత కేసులు కూడా తవ్వే ఛాన్స్ ఉంది. కార్మిక శాఖ మంత్రి గా ఉన్నప్పుడు (యూపీఏ హయాంలో) చేసిన ఆర్థిక నేరాలను తవ్వి తీయాలని ఆలోచిస్తే ఇక ఇంటి పార్టీ పెద్ద జైలు జీవితంను ఒక్కసారి అయినా పరిచయం చేసుకోవాల్సిందే! ఇక ఈడీ ని రంగంలో ఎప్పుడు దింపనుంది ఎలా ఈ కేసుల బనాయింపు ఉండనుంది అన్నది బీజేపీ నిర్ణయాంచిల్సిన విషయం. ఎన్నికల ముందే కేసీఆర్ ను అరెస్టు చేయిస్తే టీఆర్ఎస్ లో ఓ ముసలం పుట్టించి పార్టీలో సీనియర్లను తనవైపు తిప్పుకోవాలన్న ఉబలాటంలోనూ అత్యుత్సాహంలోనూ బీజేపీ ఉంది. అందుకే దీనిని ముందుగా గుర్తించిన కేసీఆర్ సిల్లీ బీజేపీ, ఢిల్లీ బీజేపీ అంటూ విభజన ఒకటి తీసుకువస్తూ జాగ్రత్తగా కేంద్రంలో ఉన్న పెద్దలను పెద్దగా ఏమీ అనకుండా కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో జాగ్రత్త పడుతున్నారు. కొన్ని సార్లు నోరు జారి అదే సమయంలో తనదైన మేనరిజాన్ని కొనసాగిస్తున్నారు కూడా! ఏదేమైనప్పటికీ కేసీఆర్ ను ఈడీ ఉచ్చులో దింపడమే కేంద్రం టార్గెట్! అటుపై ఆట ను ఈటెల మొదలు పెడ్తాడు. కిషన్ రెడ్డి కొనసాగిస్తాడు. బండి సంజయ్ మాత్రం ఆటలో అరటి పండులా మిగిలి ఉంటాడు. ఇదే ఫిక్స్!