దేవినేని ఉమా కెరీర్‌కు ఇదే పెద్ద అగ్ని ప‌రీక్ష‌..!

VUYYURU SUBHASH
టీడీపీ కీల‌క నేత‌, మాజీ మంత్రి దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర రావు ఎప్పుడూ కూడా త‌న దే పై చేయి ఉండాల‌ని చూస్తారు. పార్టీ అధికారంలో ఉన్నా .. ప్ర‌తిప‌క్షంలో ఉన్నా కూడా ఉమా త‌న‌దే పై చేయి గా ఉండేందుకు ఎన్నో అష్ట‌క‌ష్టాలు ప‌డుతూ ఉంటారు. సొంత పార్టీ నేత‌లు అయినా.. ప్ర‌తిప‌క్ష నేతలు అయినా కూడా ఉమా ఎవ్వ‌రి ని వ‌ద‌ల‌కుండా తానే మిన్న అనేందుకు రాజ‌కీయంగా ఎత్తులు వేస్తూ ఉంటారు. అయితే గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు తొలిసారి ఎదురు దెబ్బ త‌గిలింది. దేవినేని కుటుంబానికి చిర‌కాల రాజ‌కీయ శ‌త్రువులుగా ఉన్న వ‌సంత ఫ్యామిలీకి చెందిన వ‌సంత కృష్ణ ప్ర‌సాద్ ఉమాను స‌వాల్ చేసి మ‌రీ మైల‌వ‌రంలో మ‌ట్టి క‌రిపించారు.

ఇక ఆ త‌ర్వాత ఉమా స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం మొత్తం మీద కేవ‌లం 5 స‌ర్పంచ్ స్థానాల‌తో స‌రి పెట్టుకుని ఘోరంగా ఓడిపోయారు. ఇక ఇప్పుడు ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలోనే ఉన్న కొండ‌ప‌ల్లి మున్సిపాల్టీ ఎన్నిక‌లు ఉమా కెరీర్‌కు అగ్ని ప‌రీక్ష‌గా మారాయి. కొండ‌ప‌ల్లి మున్సి పాల్టీ అయ్యాక ఈ మునిసిపాలిటీకి తొలిసారి ఎన్నికలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే కృష్ణ ప్ర‌సాద్ ఎలాగైనా ఇక్క‌డ వైసీపీ జెండా ఎగ‌ర వేసి ఉమా కు పూర్తి గా చెక్ పెట్టేయాల‌ని భావిస్తున్నారు.

దీంతో ఉమా ఈ సారి అయినా గెలిచి ప‌రువు నిలుపు కోవాల‌ని అష్ట క‌ష్టాలు ప‌డుతున్నారు. మ‌రో వైపు ఎమ్మెల్యే కృష్ణ ప్ర‌సాద్ కు తోడు ఇటీవ‌ల ఎమ్మెల్సీ గా ఎన్నికైన ( ఇప్ప‌టికే అభ్య‌ర్థిత్వం ఖారారు అయ్యింది.. ఎమ్మెల్సీ కావాడం లాంఛ‌న‌మే.) త‌ల‌శిల ర‌ఘురాం ప‌ట్టుబ‌ట్టి మ‌రీ ఇక్క‌డ మకాం వేసి ఉమా ప‌రువు మ‌రోసారి తీయాల‌ని క‌సితో ప‌ని చేస్తున్నారు. మ‌రి ఉమా ఈ సారి అయినా గెలిచి తానేంటో ఫ్రూవ్ చేసుకుంటారా ?  లేదా ? అన్న‌ది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: