తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక మద్యం ద్వారానే కొన్ని కోట్ల ఆదాయాన్ని కొల్లగొడుతూ వస్తోంది. ఒక హుజురాబాద్ లోనే ఉప ఎన్నిక సందర్భంగా వందల కోట్ల మద్యాన్ని ప్రజలు తాగేశారు. అంటే ఇంక రాష్ట్రవ్యాప్తంగా మద్యం ఏ విధంగా అమ్ముతున్నారో ఈ పరిస్థితిని చూస్తే అర్థమవుతుంది. ఇంకా ఈ ఏడాది అయితే ఒక్కో మద్యం టెండర్ కు రెండు లక్షల రూపాయలు డిపాజిట్ గా తీసుకుంటున్నారు. దీని ద్వారా కోట్ల సంపాదన ప్రభుత్వానికి అందుతోంది. మద్యానికి ఇచ్చినంత ప్రియారిటి ప్రభుత్వం నిరుద్యోగుల విషయంలో ఆలోచించడం లేదని అర్థమవుతోంది. మరి పోయిన ఏడాది మద్యంతో ఎంత లాభాలు వచ్చాయో తెలుసుకుందామా..?
2019- 21 సంవత్సరాల గాను రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 44 వేలకు పైగా దరఖాస్తులు రాగా 2216 దుకాణాలను ప్రభుత్వానికి 880 కోట్ల ఆదాయం కేవలం దరఖాస్తుల రూపంలోనే వచ్చింది. ప్రస్తుతం రాబోయే 2021-23 సంవత్సరాలకు గానూ మరో 404 దుకాణాల సంఖ్య పెంచుతూ మొత్తం 2620 వైన్ షాపులకు ప్రభుత్వం దరఖాస్తులను కోరుతున్నది. షాపుల సంఖ్య పెంచడం ద్వారా దరఖాస్తుదారుల సంఖ్య కూడా పెరుగుతోంది. తద్వారా ప్రారంభంలోనే ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రభుత్వము తపన పడుతున్నట్లుగా తెలుస్తున్నది.
2021 డిసెంబర్ 1వ తేదీ నుండి ప్రారంభం కానున్న కొత్త షాపుల ద్వారా అటు సామాజిక వర్గాలను మరియు తృప్తి చేయడంతో పాటు ఇటు షాపుల సంఖ్య పెంచి గణనీయంగా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవడానికి వేసిన ఎత్తుగడగా దీన్ని భావించవచ్చు. ఒక అంచనా ప్రకారం గా రాబోయే రెండు సంవత్సరాల గాను దరఖాస్తుల సంఖ్య 50,000 దాటుతుందని దరఖాస్తుల రూపంలోనే ప్రభుత్వానికి 1000 కోట్ల వరకు ఆదాయం వస్తుందని ఎక్సైజ్ శాఖ ప్రకటించడాన్ని పౌర సమాజం, ప్రజాసంఘాలు, అఖిలపక్షాలు, బుద్ధి జీవులు ,మేధావులు సీరియస్గా ఆలోచించవలసిన అవసరం ఎంతగానో ఉన్నది అని చెప్పవచ్చు.