ఊహించ‌ని వ్య‌క్తిని ఎమ్మెల్సీని చేసిన జ‌గ‌న్‌...ఆ స్ట్రాట‌జీ ఏంటి..!

VUYYURU SUBHASH
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎవ్వ‌రూ ఊహించ‌ని ఎత్తుల‌తో పాటు.. ముందు చూపుతోనే వెళుతున్నారు. జ‌గ‌న్ 2024 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేస్తోన్న జ‌గ‌న్ స్ట్రాట‌జీ లు ఎవ్వ‌రికి అర్థం కావ‌డం లేదు. తాజా గా ఎమ్మెల్యేల కోటాలో ముగ్గురు ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేసిన జ‌గ‌న్ కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన ఇషాక్ భాషా కు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం వైసీపీ వాళ్ల‌కే అంతు ప‌ట్ట‌డం లేదు.

జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయిన‌ప్ప‌టి నుంచి మైనారిటీలకు పదవుల విషయంలో ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీ పదవులను గతంలో ముగ్గురికి ఇవ్వ‌గా.. ఇప్పుడు ఏకంగా నాలుగో మైనార్టీ కి ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇషాక్ భాషాకు కూడా ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం పెద్ద రాజకీయ ఎత్తుగడేనన్న విశ్లేషణలు వ‌స్తున్నాయి. క‌ర్నూలు  జిల్లా లో మాత్ర‌మే కాకుండా.. యావ‌త్ సీమ‌లో ఉన్న ముస్లింలు ముందు నుంచి వైసీపీకి అనుకూలంగా నే ఉంటున్నారు.

అందుకే అనంత‌పురం నుంచి మైనార్టీ కోటాలో హిందూపురం ఇన్ చార్జ్ మ‌హ్మ‌ద్ ఇక్బాల్ కు ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇక క‌డ‌ప జిల్లా నుంచి రాయ‌చోటి కి చెందిన జ‌కియా ఖానూమ్‌కు ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇప్పుడు క‌ర్నూలు జిల్లా నుంచి ఇషాక్ భాషాకు ఎమ్మెల్సీ ఇచ్చారు. ఓవ‌రాల్ గా సీమ‌లో మైనార్టీ ఓట‌ర్ల‌ను పూర్తి గా త‌న వైపున‌కు తిప్పుకునే క్ర‌మంలోనే భాషా కు ఎమ్మెల్సీ ఇచ్చారన్న టాక్ పార్టీలో వినపడుతుంది.

ఇక భాషా విషయానికి వ‌స్తే ప్ర‌స్తుతం ఆయ‌న నంద్యాల మార్కెట్ యార్డు ఛైర్మన్ గా ఉన్నారు. నంద్యాలలో టీడీపీకి ముస్లిం నేతలు ఎక్కువగా ఉండ‌డం తో పాటు అక్క‌డ టీడీపీకి ఎన్ఎండీ ఫరూక్ నేతగా ఉన్నారు. నంద్యాలలో పార్టీ మరింత బలపడాలంటే ఇషాక్ ను ఎమ్మెల్సీ ఇవ్వ‌డ‌మే క‌రెక్ట్ అని జ‌గ‌న్ భావించారు. గ‌తంలో నంద్యాల ఉప ఎన్నిక‌ల స‌మ‌యంలోనే ఆయ‌న ఇక్క‌డ ముస్లిం నేత‌కు ఎమ్మెల్సీ ఇస్తాన‌ని హామీ ఇచ్చి ఇప్పుడు నెర‌వేర్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: