కుప్పం పై చంద్ర‌బాబుకు ఇంత టెన్ష‌న్ ఉందా... మాములు భ‌యం కాదుగా..!

VUYYURU SUBHASH
మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు కు కుప్పం మున్సిప‌ల్ ఎన్నిక‌ల టెన్ష‌న్ అయితే మామూలుగా లేద‌నే చెప్పాలి. ఆయ‌న రోజుకు ఏకంగా నాలుగై దు సార్లు కుప్పంలోని టీడీపీ నేత‌ల‌తో మాట్లాడుతున్నారు. మాజీ మంత్రి అమ‌ర‌నాథ్ రెడ్డితో స‌హా ఓ ప‌ది ప‌దిహేను మంది రాష్ట్ర స్థాయి నేత‌ల‌ను అక్క‌డ మోహ‌రించారు. ఇక చిత్తూరు జిల్లా స్థాయి నేత‌లు అంద‌రూ కుప్పం లో మ‌కాం వేసి ఈ బుడ్డ‌ మున్సిపాలిటీలో టీడీపీని గెలిపించేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు.

డ‌బ్బు తో మొద‌లు పెట్టి మ‌ద్యం విష‌యం వ‌ర‌కు చూస్తే అస్స‌లు ఎక్క‌డా రాజీ ప‌డ‌కూడ‌ద‌ని కూడా బాబు పార్టీ కేడ‌ర్ కు ఆదేశాలు జారీ చేస్తున్నార‌ట‌. ఒక వేళ వైసీపీ వాళ్లు కేసులు పెడితే ఏ మాత్రం వెన‌క్కు త‌గ్గ‌కుండా ఎదురు కేసులు పెట్టాల‌ని కూడా బాబు ఆదేశాలు జారీ చేశార‌ట‌. ఇదొక్క‌టే కాదు.. తాను ప్ర‌ధాన‌మంత్రి స్థాయి నేత‌ను అని భావించే చంద్ర‌బాబు చివ‌ర‌కు మున్సిపాల్టీ చైర్మ‌న్ ఎంపిక విష‌యంలో ఎమ్మెల్యే గా త‌న ఎక్స్ అఫీషియో ఓటు హ‌క్కును కూడా ఇక్క‌డే న‌మోదు చేయించుకున్నారు.

రేపు వార్డులు స‌మానంగా వ‌స్తే అప్పుడు ఎక్స్ అఫీషియో ఓట్లు కీల‌కం అవుతాయి. ఇలా కుప్పం పై పసుపు జెండా ఎగ‌రేసేందుకు చంద్ర‌బాబు త‌న‌కు వ‌చ్చిన ఏ చిన్న అవ‌కాశం కూడా వ‌దులు కోవ‌డం లేద‌ని అంటున్నారు. ఇక ఇప్ప‌టికే ఆయ‌న నోటిఫికేష‌న్ రాకుండానే కుప్పం వెళ్లి అక్క‌డ వార్డుల్లో ప్ర‌చారం చేసి మ‌రీ టీడీపీని గెలిపించాల‌ని కోరి వ‌చ్చారు. ఇప్పుడు పై నుంచి ప్ర‌తి రోజూ ఓ అసెంబ్లీ ఎన్నిక‌ల రేంజ్‌లో గైడెన్స్ ఇస్తున్నారు.

ఏదేమైనా జాతీయ స్థాయి నేత‌గా భావించుకు నే చంద్ర‌బాబు త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం లోని ఓ మున్సి పాల్టీ లో పార్టీని గెలిపించు కోవ‌డానికి ఇంత ఆప‌సోపాలు ప‌డుతుండ‌డం ఆయ‌న అభిమానుల‌కే మింగుడు ప‌డ‌ని ప‌రిస్థితి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: