యాత్ర కు నాలుగేళ్లు : మళ్లీ తెరపైకి క్విడ్ ప్రోకో? ఈ సారి స్కాం ఎంతో ?
ఇక తాజాగా పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ తెరపైకి వచ్చి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఎండగట్టారు. వాస్తవానికి ఈ ఆరోపణ ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ పయ్యావుల కేశవ్ ఆధారాలతో సహా నిరూపిస్తానని కూడా చెబుతున్నారు. ముఖ్యంగా సోలార్ ఎనర్జీ కి సంబంధించిన కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం అదానీలకు ఎలా దాసోహం అయిందన్నది ఆయన వివరిస్తున్నారు. సోలార్ ఇండియా కార్పొరేషన్ నుంచి తక్కువ ధరకే అంటే యూనిట్ ధర రూపాయి 90 పైసలకే విద్యుత్ లభిస్తుంటే, జగన్ ప్రభుత్వం మాత్రం యూనిట్ ను రెండు రూపాయల 49 పైసలకు కొనుగోలు చేయడంపై అభ్యంతరాలు చెబుతూ కేశవ్ తనదైన శైలిలో స్పందించారు. మొత్తం 9 వేల మెగా యూనిట్ల కొనుగోలులో జరిగిన మతలబును వివరించారు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తికి సరైన వనరులున్నా కూడా , సోలార్ ఎనర్జీ కి సంబంధించి కూడా ప్లాంట్లు ఉన్నా కూడా ఉన్న వాటిని పట్టించుకోక, అభివృద్ధి చేయక అదానీ ప్రేమ లో ముఖ్యమంత్రి ఉండడంపైనే పలు అనుమానాలు రేగుతున్నాయి.
కొన్ని కొత్త ఒప్పందాల కారణంగా యూనిట్ ను నాలుగు రూపాయల 30 పైసలకు కొనుగోలు చేయడమే అర్థరహితం అని అంటున్నారు. మరి! వీటిపై సీఎం ఏ విధంగా స్పందిచనున్నారో కూడా చూడాలి. రాష్ట్రానికి సంబంధించి ఇప్పటికే గన్నవరం పోర్టు వాటాను ఆదానీకి అమ్మేసిన జగన్ తదనంతర పరిణామాల్లో ఎన్నో వివాదాలకు కారణం అయ్యారు. ఇప్పుడు విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి ముఖ్యంగా సోలార్ పవర్ కు సంబంధించి జగన్ మళ్లీ మళ్లీ అదానీ కుటుంబాలకు మేలు చేయడంపై పయ్యావుల కేశవ్ మండిపడుతున్నారు. సొంత ప్రయోజనాలే పరమావధిగా సాగే రాజకీయంలో విద్యుత్ కొనుగోళ్లు అన్నవి
ఏ మేరకు ప్రభావితం చేస్తాయో!