క‌ర్నాట‌క‌లో క‌లిసిపోతామంటోన్న తెలంగాణ ప్ర‌జ‌లు..!

VUYYURU SUBHASH
ఇటీవ‌ల మ‌నం ఆంధ్రా - ఒడిశా స‌రిహ‌ద్దు లో 21 గ్రామ పంచాయ‌తీల‌కు చెందిన కొఠియా ప్ర‌జలు తాము ఏపీలో క‌లిసి పోతామంటూ అధికారుల‌ను వేడుకుంటున్నారు. ఇది మ‌నం త‌ర‌చూ వార్త‌ల్లో చూస్తున్నాం. ఇక ఇప్పుడు తెలంగాణ‌లో ఇదే ప‌రిస్థితి నెల‌కొంది. తెలంగాణ - క‌ర్నాక‌ట స‌రిహ‌ద్దుల్లో తెలంగాణ రాష్ట్ర ప్ర‌జ‌లు తాము క‌ర్నాట‌క‌లో క‌లిసి పోతామ‌ని చెపుతున్నార‌ట‌. ఇటీవ‌ల కేటీఆర్ తో పాటు కొంద‌రు ఎమ్మెల్యేలు కర్ణాటకలోని రాయచూర్ ఎమ్మెల్యే, ప్రజలు త‌మ ప్రాంతాన్ని తెలంగాణలో కలవాలని డిమాండ్ చేస్తున్నారంటూ గొప్ప‌గా ప్ర‌చారం చేసుకున్నారు.

అయితే ఇప్పుడు తెలంగాణ - క‌ర్నాట‌క స‌రిహ‌ద్దు ప్రాంతాల్లోని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కొన్ని గ్రామాల ప్ర‌జ‌లు తెలంగాణ సర్కార్ కంటే కర్ణాటక ప్రభుత్వమే చాలా బాగా ప‌ని చేస్తోంద‌ని అక్క‌డ రాయ‌చూర్ ఎమ్మెల్యే కు కూడా థ్యాంక్స్ చెప్పి వ‌చ్చారు. ఈ ప్రాంతం ఎక్క‌డో కాదు... మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ నియోజకవర్గంలో చేగుంట, కున్సి గ్రామాలు కర్నాటక రాష్ట్రంలోని యాదగిరి - రాయిచూరు హైవేపై ఉంటాయి. ఈ రెండు హైవే పై ఉండ‌డంతో బ‌స్సు సౌక‌ర్యాలు చాలా ఇబ్బంది గా మారింది.

పైగా హైవే పై ఉండ‌డంతో క‌ర్నాట‌క బ‌స్సుల‌ను ఎక్కువుగా వాడుకుంటున్నారు. అయితే  అక్క‌డ బ‌స్సు స్టాప్ లేదు. క‌ర్నాట‌క ప్రాంత టిక్కెట్ తీసుకుని అక్క‌డ దిగాలి.  దీంతో వారికి ఖ‌ర్చు చాలా ఎక్కువ అవుతోంది. త‌మ రెండు గ్రామాల‌కు బుస్సులు వేయాల‌ని ఎన్నో సార్లు మెర పెట్టుకున్నా తెలంగాణ ప్ర‌భుత్వం స్పందించ‌డం లేదు. దీంతో వారు  రాయ‌చూర్ ఎమ్మెల్యేను క‌లిసి త‌మ‌కు బ‌స్ స్టాప్ ఇవ్వాల‌ని. .. త‌మ ప్రాంతం వ‌ర‌కు టిక్కెట్ రేట్లు ఉండేలా చూడాల‌ని కోరారు. వెంట‌నే రాయ‌చూర్ ఎమ్మెల్యే ఉత్త‌ర్వులు జారీ అయ్యేలా చేశారు. దీంతో ఆ గ్రామాల ప్రజలు తెలంగాణ కంటే క‌ర్నాక‌ట‌నే బెట‌ర్ అని చెప్పారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: