కేసీఆర్ Vs ఈటెల: ఎవ‌రు గెలిచి ఎవ‌రు ఓడినా మునిగిపోయేది ఆ పార్టీయే...?

VUYYURU SUBHASH
దుబ్బాక లో సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డమే కాకుండా.. గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల్లో కూడా భారీ స్థాయిలో డిజ‌విన్లు గెలుచుకున్న బీజేపీకి తెలంగాణలో మరో అవకాశం హుజూరాబాద్ ఎన్నికల సందర్భంగా వచ్చిందనే రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ ప‌డుతున్నారు. బీజేపీ గ‌త లోక్‌స‌భ ఎన్నిక‌ల త‌ర్వాత నుంచి తెలంగాణ లో అధికార టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటూ వస్తోంది. ఈ క్ర‌మంలోనే ఈ తాజా  ఉప ఎన్నికలలో మారోసారి ఈ వాదన బలపర్చుకునేందుకు బీజేపీ గ‌త నాలుగు అయిదు నెల‌ల నుంచి ఎంతో క‌ష్ట‌ప‌డుతోంది. ఈట‌ల రాజేంద‌ర్ రాజీనామా తో జ‌రుగుతున్న ఈ హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీల మధ్యనే పోటీ ఉంది. ఇక్క‌డ కాంగ్రెస్ పోటీ చేస్తున్నా.. అది ఆట‌లో అర‌టి పండు చందంగా మార‌నుంది.

అయితే ఇప్పుడు హుజూరా బాద్ ఫ‌లితం ఎలా ఉన్నా త‌మ భ‌విష్య‌త్తు ఏంట‌న్న బెంగ అయితే కాంగ్రెస్ నేత‌ల్లో ఉంది. రేవంత్ రెడ్డి తెలంగాణ పీసీసీ అధ్య‌క్షుడిగా వ‌చ్చాక ఆ పార్టీకి చాలా చోట్ల కొత్త జోష్‌ అయితే వ‌చ్చింది. ఇప్పుడు ఇక్క‌డ కాంగ్రెస్ ఓడిపోయినా లేదా మూడో స్థానంలో ఉన్నా అంత‌క‌న్నా దిగ‌జారి డిపాజిట్లు కూడా కోల్పోయినా తెలంగాణ లో ఆ పార్టీ మ‌రింత మునిగి పోవ‌డం ఖాయ‌మే అని చెప్పాలి. ఇదే ఇప్పుడు కాంగ్రెస్ నేతలకు ప‌ట్టుకున్న భ‌యం.

మ‌రోవైపు బీజేపీ ఇప్ప‌టికే దుబ్బాక లో గెలిచింది. అక్క‌డ కాంగ్రెస్ మూడో స్థానంతో ఘోర అవ‌మానం మిగుల్చుకుంది. ఇక జీవీఎంసీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ కు కేవ‌లం రెండు డివిజ‌న్లు మాత్ర‌మే వ‌చ్చాయి. ఇప్పుడు హుజూరా బాద్‌లో క‌నుక బీజేపీ గెలిస్తే తెలంగాణ లో అధికార టీఆర్ ఎస్‌కు తామే ప్ర‌త్యామ్నాయం అన్న సంకేతాలు బ‌లంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకు వెళుతుంది. అప్పుడు అంతిమంగా కాంగ్రెస్ మ‌రింత ప‌త‌నం అయిపోవ‌డం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: