చైనాలో ట్రిలియన్ డాలర్ల సంక్షోభం.. అందుకే?

praveen
మొన్నటి వరకు అగ్రరాజ్యమైన అమెరికా ను వెనక్కినెట్టి ఏకంగా ప్రపంచదేశాలకు పెద్దన్నగా మారాలి అని ఎన్నో కుట్రలు పన్నింది చైనా. చైనా పన్నిన కుట్రలో భాగంగానే అటు  కరోనా వైరస్ కూడా ఒక బయో వెపెన్ లాగా దూసుకు వచ్చింది అనే విషయం తెలిసిందే. కరోనా వైరస్ కు సంబంధించిన నిజాలను దాల్చడంతో  ప్రపంచ దేశాలుచైనా పై పగ పట్టినట్లు గానే ఉన్నాయ్. అంతేకాదు చైనా విస్తరణ  వాద ధోరణి కూడా చైనాకు ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులు తెచ్చి పెట్టింది అని చెప్పాలి. చైనా పెట్టుకున్న వివాదాల కారణంగా అటు చైనా నుంచి ఎన్నో విదేశీ సంస్థలు తరలిపోయాయ్. అటు విదేశీ ఉద్యోగులు సైతం  చైనా నుంచి బయటికి వచ్చేశారు.

 ఇలాంటి సమయంలో ఇక చైనా రియల్ ఎస్టేట్ రంగం మొత్తం కుప్పకూలిపోయింది. సాధారణంగా చైనాలో రియల్ ఎస్టేట్ రంగ మీదనే ఎక్కువగా ఆదాయం ఆధారపడి ఉంటుంది అన్న విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలి పోవడం తో చైనా సంక్షోభంలో కూరుకుపోతోంది. అదే సమయంలో చైనాలో కరెంట్ సంక్షోభం కూడా వేధిస్తోంది. ఈ క్రమంలోనే ఎనిమిది గంటల పాటు వేగంగా ఒక షెడ్యూల్ ఫిక్స్ చేసి కరెంటు ఇవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కరెంట్ సంక్షోభం కారణంగా పరిశ్రమలు నడపలేని దుస్థితి కూడా ఏర్పడింది.

 ఇలాంటి సమయంలో చైనా లో ఉన్న అన్ని సంస్థలు కూడా నష్టాల్లో కూరుకుపోతున్నట్లు తెలుస్తుంది. దీంతో అటు ప్రభుత్వ బ్యాంకులు అన్నీ కూడా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి.  వందల కోట్లు కాదు ఏకంగా వేల కోట్ల రూపాయలు సంక్షోభంలో కూరుకుపోయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఏకంగా ఎనిమిది ట్రిలియన్ డాలర్లకు సంబంధించినటువంటి అప్పులు చెల్లించలేని స్థితిలో అక్కడి సంస్థలు ఉన్నాయి. దీంతో ఇక ఈ అప్పులు ఇచ్చిన అక్కడి ప్రభుత్వ బ్యాంకులు మొత్తం సంక్షోభంలో కూరుకు పోతున్నాయి. ఇలా చైనా ఆర్థిక వ్యవస్థ మొత్తం సంక్షోభాన్ని ఎదుర్కొనే పరిస్థితి వచ్చిన నేపథ్యంలోనే దీన్ని కవర్ చేసుకునేందుకే చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు సృష్టిస్తుంది అని విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: