ప‌వ‌న్‌కు సీఎం యోగం ఉందా... లేదా...?

VUYYURU SUBHASH
``కానిస్టేబుల్ కొడుక్కి.. ముఖ్య‌మంత్రి పీఠం ఎక్కే.. ఛాన్స్ ఇవ్వ‌రా?! ఎంత‌సేపూ.. సీఎం కొడుకులు.. రాజ‌కీ య నేత‌ల వార‌సులు మాత్ర‌మే.. ముఖ్యమంత్రులు కావాలా?`` ఇదీ.. గ‌త 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో జ‌నసేన అధినేత ప‌వన్ క‌ళ్యాణ్ చేసిన వ్యాఖ్య‌. దీనికి కొన‌సాగింపుగా కూడా ఆయ‌న రాష్ట్ర వ్యాప్తంగా త‌న‌ను ముఖ్యమంత్రి చేయాల‌ని ప్ర‌చారం చేశారు. అయితే.. గ‌త ఎన్నిక‌ల్లో త‌న‌ను ముఖ్య‌మంత్రిని చేయాలం టూ.. జ‌గ‌న్ చేసిన ప్రచారం.. పాద‌యాత్ర వంటివాటితో భేరీజు వేసుకున్నారో.. ఏమో.. ప్ర‌జ‌లు..ప‌వ‌న్‌ను ప‌క్క‌న పెట్టారు.
ఇక‌, ఇప్పుడు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌వ‌న్‌ను ముఖ్య‌మంత్రిని చేస్తారా?  ప్ర‌జ‌లు చేయాల‌ని అనుకున్నా.. ఆయ న అస‌లు ముఖ్య‌మంత్రి అవ్వాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నారా?  అంటే.. లేర‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. వినేందుకు ఒకింత చిత్రంగా అనిపించినా.. ఇది నిజం అనే చెబుతున్నారు. ముఖ్య‌మంత్రి అవ్వాలంటే.. ప్ర‌జ‌ల్లో ఉండాలి. నిత్యం వారి స‌మ‌స్య‌ల‌పై స్పందించాలి. అంతేత‌ప్ప‌... ఎన్నిక‌ల‌కు ముందు.. నాలుగు సినిమా డైలాగులతో ప‌నిన‌డిపిస్తాం.. అంటే.. కుదిరే ప‌నికాద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అయితే.. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించే లేదా.. వెలుగులోకి తెచ్చే దిశ‌గా ప‌వ‌న్ అడుగులు వేస్తున్న ప‌రిస్థితి మాత్రం క‌నిపించ‌డం లేదు.
శ్ర‌మ‌దానం పేరుతో ఒకింత హ‌డావుడి చేశారు. ఆ త‌ర్వాత‌.. ఆ మాటే మ‌రిచిపోయారు. అంతేకాదు.. ఏపీలో రాజ‌కీయాలు చేయాల్సిన నాయ‌కులు.. ఏపీలో ఉండాలి క‌దా! మ‌రి ఈ మాటే వినిపించ‌డం లేదు. క‌నిపించ‌డం లేదు అంటున్నారు ప‌రిశీల‌కులు. ప‌వ‌న్ ఇక్క‌డ నాలుగు రోజులు ఉంటే.. హైద‌రాబాద్‌లో నాలుగు నెల‌లు గ‌డిపేస్తున్నారు. ఫ‌లితంగా.. సీఎం అయ్యే ఉద్దేశం ఆయ‌న‌కు ఉందా?  లేదా? అనే సందేహాలు పార్టీ నేత‌ల్లోనే తార‌ట్లాడుతున్నాయి. నిజానికి ముఖ్య‌మంత్రి అనేది అంత తేలిక కాదు. ప్ర‌స్తుతం స‌మాజం అనేక రూపాల్లో విడిపోయి.. క‌లిసి ఉంది.
కాబ‌ట్టి.. అన్ని వ‌ర్గాల‌ను త‌న‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నం చేయాలి. అదేస‌మ‌యంలో త‌న ల‌క్ష్యం ప‌ట్ల శ్ర‌ద్ధ‌, భ‌క్తి ఉన్న విష‌యాన్ని సైతం ప్ర‌జ‌లకు చెప్పుకోవాలి. అంతేకాదు.. ప్ర‌జ‌ల‌ను న‌మ్మించాలి. ఇవ‌న్నీ చేయ‌బ‌ట్టే.. గ‌త ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ సీఎం పీఠం ఎక్కార‌నేది నిర్వివాదాంశం. అయితే.. ఆదిశ‌గా ఒక్క అడుగు కూడావేయ‌కుండానే ప‌వ‌న్ సీఎం అవుతారా? అనేది ఇప్పుడు చ‌ర్చ‌. అంతేకాదు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో, మ‌ళ్లీ ఎవ‌రితో చేతులు క‌లుపుతారో.. అనే చ‌ర్చ‌కూడా సాగుతోంది. మొత్తానికి ప‌వ‌న్‌కు సీఎం యోగం ఉందా?  లేదా? అనే చ‌ర్చ‌జోరుగా సాగుతోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: