కేసీఆర్ VS ఈటెల : కేసీఆర్ జాతకం చెప్పిన మాజీ గవర్నర్ !
వచ్చే ఎన్నికల్లో గెలుపు గురించి ఇప్పటికిప్పుడు కలలు అదీ హుజురాబాద్ నుంచి కలలు కంటోంది బీజేపీ. అదే పెద్ద విడ్డూరం. అందుకే ఈటెల గెలుపు తరువాత బీజేపీ శ్రేణులకు ఇంకొన్ని కొత్త శక్తులు వస్తాయా ఏంటా అన్నంత స్థాయిలో మహా నాయకులు కొందరు తమ తమ మాటలకు పదును ఇస్తున్నారు. ఓ విధంగా ఆశ మంచిదే కానీ అత్యాశ....? ఇప్పుడిదే బీజేపీ నాయకులను వెన్నాడుతోంది. హుజురాబాద్ గెలుపు తెలంగాణ గెలుపు ఒక్కటే అని భావిస్తోంది. అందుకు తగ్గ విధంగా ఊహాగానాలు ప్రచారం చేస్తోంది. అవి సరిగ్గా వాస్తవం రూపంలోకి వస్తాయో లేదో? అసలే బలహీనమైన క్యాడర్ ఉన్న బీజేపీకి ఇవి గొంతెమ్మ కోరికలే!
ఎలా లేదన్నా కొన్ని విషయాలు నవ్వు తెప్పిస్తాయి. అయితే అవి జరుగుతాయా లేదా అన్నది అటుంచింతే ఈటెలను రానున్న కాలంలో తెలంగాణ సీఎం చేయాలని బీజేపీ అనుకుంటుందని టాక్. ఈ క్రమంలోనే హుజురాబాద్ ఎన్నిక ఒకవేళ తమకు అను కూలం అయితే బీజేపీ మిగతా స్థానాలపై పట్టు సాధించేందుకు ప్రయత్నించనుంది. ఇప్పటికే దుబ్బాకను గెలుచుకున్న స్పీడులో ఉన్న బీజేపీ రాబోవు కాలంలో కాబోవు సీఎం ఎంపికలోనో లేదా ఎంపిక చేసిన వ్యక్తికి సీఎం ను చేసే ఉద్దేశంతోనే మనసు అంతా వచ్చే కాలంపై పెంచుకుని జ్యోతిషం చెబుతోంది. అలా చెప్పడం తప్పు కాదు కానీ సాధ్యం అయ్యే పనులేవో బీజేపీ చేస్తే బాగుంటుంది.
కేసీఆర్ జాతకం ఎలా ఉండబోతోంది. 2023లో ఆయన సీఎం కానున్నారా లేదా? అయినా ఆయన సీఎం కాకపోతే ఏం జరుగుతోం ది..ఇలాంటి వాటికెన్నింటికో మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యా సాగర్ రావు సమాధానం చెప్పారు. రానున్న కాలంలో హుజురాబాద్ ను గెలిపించుకుని తద్వారా తెలంగాణపై పట్టు సాధించాలని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ నుంచి తెలంగాణ చేజారిపోకూడదన్న సంకే తాలు ఇస్తూ.. శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. ఇదంతా బాగుంది కానీ బీజేపీకి తెలంగాణలో వచ్చే సీట్లు ఎన్ని.. ప్రభుత్వం ఏర్పాటు చేసే సత్తా ఉంటుందా లేదా ఇవేవీ ఆలోచించకుండా విద్యాసాగరరావు వ్యాఖ్యానించారా ఏంటి?