ఏపీ రాజకీయాల్లోకి టీఆర్ఎస్?
తొలి నుంచి అనుకున్న విధంగానే టీఆర్ఎస్ చుట్టుపక్కల రాష్ట్రాలపై పట్టు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆంధ్రా రాజకీ యాల్లోకి అడుగుపెట్టాలన్న యోచనలో ఉన్నారు కేసీఆర్. అదే ఇవాళ ప్లీనరీ సందర్భంగా చెప్పారు. తన ప్రభుత్వం చేపట్టిన దళిత బంధు పథకం ఎంతో పేరు తెచ్చుకుందని, అందుకే ఏపీ నుంచి ఈ పథకంకు సంబంధించి వేల సంఖ్యలో అర్జీలు వస్తున్నాయని అన్నారు. అందుకే తనకు అటు ఏపీ నుంచి కూడా మంచి మద్దతు వస్తుందన్న అర్థ ధ్వనితో మాట్లాడారు. సో.. ఈ సారి ఏపీ రాజకీయాలపై టీఆర్ఎస్ ప్రభావం తప్పక ఉంటుంది అన్నది గ్యారెంటీ. గతంలో కూడా కేసీఆర్ మాటల ప్రభావం ఏపీ రాజకీయాలపై ఉంది. జగన్ కు బాహాటంగా కాకున్నా తెర వెనుక మద్దతు ఇచ్చింది కేసీఆరే! ఇప్పుడు ఆయన ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయాలు మారనున్నాయి.
వాస్తవానికి కేసీఆర్ ప్రభావం 13 జిల్లాల ఆంధ్రావనిలో ఏడు జిల్లాలలో కేసీఆర్ ప్రభావం ఉంది. ఉత్తరాంధ్రతో సహా ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, ప్రకాశం జిల్లాలు. ఆ మాటకు వస్తే తెలంగాణతో సరిహద్దు పంచుకుంటున్న ఆంధ్రా పల్లెలపై కేసీఆర్ ప్రభావం ఉంటుంది. అందుకే నేరుగా ఆయన పార్టీ ఇటుగా రాజకీయాల్లోకి రాకున్నా ఇక్కడి రాజకీయ నాయకులకు నేరుగా మద్దతు ఇచ్చి కేసీఆర్ మరింత బలపడుతున్నారు. తెలంగాణ ప్రజల అభివృద్ధే తన మతమని అభిమతమని చెప్పే కేసీఆర్ కు ఇటు అభిమాన గణం చాలా ఉంది. ఇవన్నీ కేసీఆర్ తో సహా ఇతరులు ఆంధ్రా రాజకీయాలపై ఉండనుంది. రాష్ట్రం విడిపోయాక ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయమై కేసీఆర్ తో మనకు సాయం ఎంతో అవసరం. తగాదాలు లేని వేళ ఏపీ, తెలంగాణ కలిసి పనిచేస్తే మరికొన్ని అభివృద్ధి పనులు చేసేందుకు ఛాన్స్ ఉంది.