జమ్మికుంట రూరల్ నాగంపేటలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో హరీష్ రావు మాట్లాడుతూ...గవర్నమెంట్ ను ఎందుకు కూలగొడతవు రాజేందర్....? అంటూ హరీష్ రావు ప్రశ్నించారు. 2016 రూ పెన్షన్ ఇచ్చినందుకు కూలగొడతవా? అంటూ ప్రశ్నించారు. రైతులకు 10 వేలు రైతు బంధు ఇచ్చినందుకు కూలగొడతవా?...ఆడపిల్లలకు లక్ష రూపాయల కళ్యాణ లక్ష్మి ఇచ్చిందుకు కూలగొడతవా..?...బాయిల కాడ 24 గంటల కరెంటు ఇచ్చినందుకు కూలగొడతవా..? అంటూ హరీష్ రావు ఈటెలపై వరుస ప్రశ్నలు కురిపించారు. హూజూరాబాద్ నడుమంతర ఎన్నికలని...రెండేళ్లనాలుగు నెలల కోసం ఎన్నుకోబోతున్నామని అన్నారు. మనకు సాయం చేసే చేయి ఎంటి. మనకు అన్నం పెట్టే వాల్లు ఎవరు. అన్నది ప్రజలు ఆలోచించాలని హరీష్ రావు వ్యాఖ్యానించారు.
పని చేసే వాళ్లు ఎవరు అనేది చూడాలని.... బీజేపీ వాళ్లు తిట్టడమే పని గా పెట్టుకున్నారని చెప్పారు. అబద్దాల బీజేపీకి- నమ్మకాల టీఆర్ఎస్ కు మధ్య పోటీ జరుగుతుందంటూ హరీష్ రావు ఆసక్తికర కామెంట్లు చేశారు. అబద్దాలు చెప్పే బీజేపీ కావాలా...నమ్మకాలు నిలబెట్టే టీఆర్ఎస్ కావాలా ఆలోచించండంటూ హరీష్ రావు వ్యాఖ్యానించారు. 200 రూ. పెన్షన్ వేయి చేస్తా అని కేసీఆర్ గెలిచాక అన్నారని...వేయిని 2016 చేస్తా అని మళ్లీ గెలిపించండి అన్నారు.. అయిందాలేదా..? అని ప్రశ్నించారు. రైతు కోసం 4 వేలు ఉండే రైతు బంధును ఐదు వేలు చేస్తా అన్నడు చేసిండా లేదా..? అని ప్రశ్నించారు. కళ్యాణ లక్ష్మి కోసం మొదట 50 వేల రూ. ఎస్సీలకే ఇచ్చిండు.
తర్వాత మమ్ముల్ని గెలిపించండి పేదలందరికీ లక్ష నూట పదహార్లు ఇస్తా అన్నడు కేసీఆర్ ఇచ్చిండా లేదా అంటూ హరీష్ రావు వ్యాఖ్యానించారు. మమ్మల్ని గెలిపించండి..ఎండాకాలంలోనూ సాగు నీరు ఇస్తా అని కేసీఆర్ గారు చెప్రిండ్రు. ఇచ్చిండా లేదా..? అని అడిగారు. జనం గెలవాలా...రాజేందర్ గెలవాలా..జనం గెలావాలంటే కారుకు- రాజేందర్ ఒక్కడు గెలావాలంటే బీజేపీకి ఓటు వేయాలంటూ హరీష్ రావు వ్యాఖ్యానించారు. రెండు గుంటల భూమి గెల్లుకు ఉంది. ఆస్థి లేదు. ఉద్యమ కారుడు. రాజేందర్ కు అహంకారం ఉంది. ఎకరం అమ్ముతా ఎన్నికలు గెలుస్తా అంటున్నాడు. ఇది అహంకారం కాదా..? అంటూ వ్యాఖ్యానించారు.