ఇండియ‌న్ స‌బ్‌స్క్రైబ‌ర్ల‌కు అమేజాన్ ప్రైమ్ షాక్‌

VUYYURU SUBHASH
మ‌న దేశంలో ఓ విధంగా ఓ టీటీ విప్ల‌వానికి పునాది వేసిన సంస్థ‌గా అమేజాన్ ప్రైమ్ సంస్థ నిలుస్తుంది అన‌డంలో సందేహం లేదు. నెట్ ఫ్లిక్స్ వ‌ర‌ల్డ్ వైడ్ గా ఆధిప‌త్యం చెలాయిస్తోన్న టైంలో ఇండియా వ‌ర‌కు అమేజాన్ సంస్థ తిరుగులేని శ‌క్తి గా ఆవిర్భ‌వించింది. ఓటీటీ అంటే చాలా మంది కి తెలియ‌ని టైంలో కూడా ఎంట్రీ ఇచ్చి ల‌క్ష‌లాది మంది స‌బ్ స్క్రైబ‌ర్ల‌ను సొంతం చేసుకుంది. ఇక క‌రోనా టైంలో ప్రైమ్ కోట్లాది మందికి సంతోషాన్ని ఇచ్చింది. ఈ ప్రైమ్ తో ఎంతో మంది రిలాక్స్ అయ్యారు.
ముందుగా ఆఫ‌ర్ల పేరుతో కేవ‌లం యేడాదికి రు. 500 కే స‌బ్ స్క్రిప్ష‌న్‌ను అందించిన ఘ‌న‌త సొంతం చేసుకుంది. ఇక కొన్ని పెద్ద సినిమాల‌ను సైతం థియేట్రిక‌ల్ రిలీజ్ అయిన వెంట నే ప్రైమ్ లో పెట్ట‌డంతో ఎక్కువ మంది స‌బ్ స్క్రైబ‌ర్లు అమోజా న్ సొంతం అయ్యారు. మిగిలిన పోటీ సంస్థ‌లు ఎన్ని ఉన్నా అమేజాన్ ఇచ్చిన కంటెంట్ తో పోలిస్తే అవి చాలా త‌క్కువ కంటెంట్ మాత్ర‌మే ఇచ్చాయి.
ఇక గ‌త కొన్నేళ్ల నుంచి యేడాది కి రు. 999 కే స‌బ్ స్క్రిప్ష‌న్ ఇచ్చింది. అయితే ఇప్పుడు ఇండియ న్ స‌బ్ స్క్రైబ‌ర్ల‌కు పెద్ద షాక్ ఇస్తూ ఏకంగా 50 శాతం రేట్లు పెంచేస్తోంద‌ట‌. ఒకే సారి ఇంత పెంపుద ల అంటే స‌బ్ స్క్రైబ‌ర్ల‌కు నిజంగా పెద్ద భార‌మే అని చెప్పాలి. యేడా ది స‌బ్ స్క్రిప్ష‌న్ రేటు రు. 999 నుంచి రు. 1499 కు పెరుగుతోంద‌ట‌. దీనిపై ఇప్ప‌టికే అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చేసింది.
అయితే ఈ కొత్త రే ట్ల పెరుగు ద‌ల ఎప్ప‌టి నుంచి అన్న‌ది మాత్రం క్లారిటీ ఇవ్వ‌లేదు. వ‌చ్చే యేడాది ఆరంభం నుంచే ఈ పెంపు ద‌ల అమ‌ల్లోకి వ‌స్తుంద‌ని అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: