వ్యాక్సినేషన్లో ఏపీ సరికొత్త రికార్డ్..

Deekshitha Reddy
ఏపీలో కరోనా వాక్సినేషన్ జోరుగా సాగుతోంది. ఎక్కడ చూసినా ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి మరీ.. వాక్సిన్ వేస్తున్నారు. కరోనా వాక్సిన్ పట్ల ఏపీలో ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడంలో కూడా ప్రభుత్వం సక్సెస్ అయిందనే చెప్పాలి. దీంతో దాదాపుగా అందరూ వాక్సిన్ వేయించుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. వాక్సిన్ వచ్చిన తొలి రోజుల్లో కొందరు సంకోచించినా.. ఆ తర్వాత మాత్రం టీకాలకోసం పోటీపడ్డారు.
వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుమీదున్న రాష్ట్రాల్లో ఏపీ ముందు వరుసలో ఉంది. టాప్ 5 లో చోటు దక్కించుకుంది. రెండు డోసులు పూర్తి చేస్తున్న రాష్ట్రాల్లో ఏపీ కూడా ఉంది. ఉత్తర ప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాష్ట్రాలతో పాటూ ఆంధ్రప్రదేశ్ కూడా ఈ వరుసలో నిలిచింది. ఉత్తరప్రదేశ్ రోజుకు దాదాపుగా 8 లక్షల డోసులను అందిస్తుండగా.. గుజరాత్ 4. 80 లక్షలు, కర్ణాటక 3. 82, మధ్యప్రదేశ్ 3. 71 లక్షల దోషులను ప్రజలకు అందిస్తోంది. ఆ తర్వాతి స్థానంలో ఆంధ్రప్రదేశ్ కూడా లక్షల్లోనే ప్రతీరోజూ వాక్సిన్ ఇస్తోంది. ప్రతీరోజూ వేల కొద్దీ కౌంటర్లను ఏర్పాటు చేసి.. ప్రజలకు టీకాలు అందిస్తున్నారు. ఇక రెండు డోసుల టీకా అందించే విషయానికొస్తే.. కేరళలో మొత్తం జనాభాలో 36శాతం మందికి రెండు డోసులు అందించారు. ఏపీలో 30.5 శాతం మందికి రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి కావడం విశేషం.
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ కూడా వీలుదొరికిన ప్రతీరోజూ వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో కరోనా వాక్సినేషన్ పురోగతిపై చర్చిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి మరీ వాక్సిన్ ఇచ్చేలా చర్యలు కూడా ప్రారంభించారు. ఇప్పటికే గ్రామాల్లో కూడా చాలా వరకూ జనాభాకు రెండు డోసులూ పూర్తయ్యాయి. ఇటీవల వాక్సినేషన్ ఉంటేనే మాల్స్, సినిమా హాల్స్, దేవాలయాల్లోకి అనుమతి అని ప్రకటనలు ఇస్తుండటంతో ఈ వాక్సినేషన్ శాతం మరింతగా పెరుగుతోంది. ప్రపంచంలో చాలా దేశాల్లో వాక్సినేషన్ ప్రక్రియ చాలా నెమ్మదిగా సాగుతుండగా.. మన రాష్ట్రంలో మాత్రం ఇలా వేగంగా సాగుతుండటం శుభపరిణామమేనని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: