సీమ పోరులో బాలయ్య !
కరువు నేలలను సుభిక్షం చేయాలన్న సంకల్పంతో చేపట్టిన ప్రాజెక్టులు ఇప్పుడు కేంద్రం పరిధిలోకి పోతున్నాయి. దీంతో వీటి నిర్వహణపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. మరోవైపు సీమ నాయకులు మాత్రం తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండానే ఎలా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగిస్తారని ప్రశ్నిస్తుంటే వారికి బాలయ్య అండగా ఉండి, పోరాటం చేయమనే చెబుతున్నారు.
టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కొత్త రాజకీయం ఒకటి అందుకున్నారు. కృష్ణా నీళ్లపై ఇప్పటికే తెలంగాణతో వివాదాలు అవుతున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టులో నిబంధనలకు విరుద్ధంగా జల విద్యుత్ ఉత్పత్తి ఎలా చేస్తారని టీడీపీ ప్రశ్నిస్తుంటే అందుకు బాలయ్య తొలిసారి గొంతు కలిపి, సీమ నేతలతో ఉద్యమానికి ముందుంటానని అన్నారు. హక్కుల విషయమై టీడీపీ మాట్లాడడం తగదని, ఈ ప్రాంత ప్రాజెక్టులపై తమకే మంచి పట్టు ఉందని వైసీపీ కౌంటర్ ఇస్తుంది. హంద్రీ - నీవా ప్రాజెక్టును తాగునీటి ప్రాజెక్టు గానే చంద్రబాబు పరిమితం చేస్తే తాము దానిని సాగునీటి ప్రాజెక్టుగా మార్చామని, తమ హయాంలోనే రాయలసీమ సస్యశ్యామ లం అయిందని చెబుతున్నారు.
సీమ కేంద్రంగా బాలయ్య కొత్త ఉద్యమం అందుకుంటే జగన్ కు నష్టమే. హిందూపురం పరిధిలో ఆయన రాజకీయాలు చేస్తున్నప్ప టికీ రాయలసీమ నీళ్లపై హక్కులపై మాట్లాడేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాలపై ప్ర శ్నించేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ నేపథ్యంలో రాయల సీమ ప్రాజెక్టులపై బాలయ్య గొంతెత్తుతున్నారు. కేఎంఆర్బీ పరిధిలో ప్రాజెక్టులను తీసుకు రావడంపై ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం అవుతున్న తరుణంలో సీన్ లోకి బాలయ్య వచ్చారు. హిందూపురం ఎమ్మెల్యే హోదాలో ఆయన కొన్ని మాటలు చెప్పేందు కు సిద్ధం అవుతున్నారు. కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు పరిధిలో పలు సీమ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ ఆయన ఉద్యమించను న్నారు.
నిన్నటి వేళ రాయలసీమ నీటి ప్రాజెక్టులు - భవిష్యత్ అనే అంశంపై జరిగిన సదస్సుకు ఆయన హాజరయ్యారు. పలు సమస్యలపై ప్రశ్నించారు. హంద్రీ - నీవా ప్రాజెక్టుకు 80 టీఎంసీల నికర జలాలు కేటాయించాలని కోరారు. అదేవిధంగా గోదావరి, పెన్నానదుల అనుసంబంధాన్ని పూర్తి చేయాలని కోరారు.