ఎన్నాళ్ల‌కెన్నాళ్ల‌కో... ఆ టీడీపీ మహిళా నేత క‌ల నెర‌వేరిందిగా...!

VUYYURU SUBHASH
పార్టీ అధికారంలో ఉన్నా.. ప్ర‌తిప‌క్షం లో ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీని నమ్ముకుని పార్టీలో ఉన్న అతి కొద్ది మంది నేతల్లో విజ‌య‌న‌గ‌రం జిల్లాకు చెందిన మ‌హిళా నేత‌ గుమ్మడి సంధ్యారాణి ఒకరు. ఎస్టీ సామాజికవర్గం నుంచి వచ్చిన ఆమె టీడీపీ నే న‌మ్ముకుని ఉన్నారు. ఎన్ని క‌ష్టాలు వ‌చ్చినా కూడా ఆమె మాత్రం పార్టీని వీడ‌లేదు. అయితే ఎన్నాళ్ల నుంచో ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేయాల‌ని.. త‌న‌కు ఓ నియోజ‌క‌వ‌ర్గ ఇన్ చార్జ్ ప‌ద‌వి కావాల‌ని కోరుతున్నారు. అయితే ఎట్ట‌కేల‌కు చంద్ర‌బాబు ఆమె కోరిక తాజాగా నెర‌వేర్చారు. చంద్ర‌బాబు విజ‌య‌న‌గ‌రం జిల్లా సాలూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ ఛార్జిగా గుమ్మడి సంధ్యారాణిని నియమించారు.
ఇక ముందుగా కాంగ్రెస్ లో ఉన్న ఆమె 2009లో టీడీపీలో చేరారు. అయితే ఆ ఎన్నిక‌ల‌లో నే బాబు ఆమెకు సాలూరు టీడీపీ టిక్కెట్ ఇచ్చారు. అప్పటి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పీడిక రాజన్న దొర చేతిలో ఓడి పోయారు. ఆ ఎన్నిక‌ల్లో ఆమె కేవ‌లం 1800 ఓట్ల తేడాతోనే ఓడిపోయారు. ఆమె అది దుర దృష్టం అనే చెప్పాలి. ఆ త‌ర్వాత రెండు ఎన్నిక‌ల్లోనూ సంధ్యారాణిని ప‌క్క‌న పెట్టేసి మరో గిరిజన నేత భంజ్ దేవ్ కు టిక్కెట్ ఇస్తున్నా ఆయ‌న వ‌రుస‌గా ఓడిపోతూ వ‌స్తున్నారు. మ‌రో వైపు సాలూరు లో టీడీపీ గెలిచి 20 ఏళ్లు అవుతోంది.
ఇక ఇప్పుడు కూడా భాంజ్ దేవ్ నే కంటిన్యూ చేస్తే అక్క‌డ టీడీపీ ప‌రిస్థితి మ‌రింత దిగ‌జారుతుంద‌నే భావించిన బాబు ఆయ‌న ను ప‌క్క‌న పెట్టేశారు. ఎట్ట‌కేల‌కు అక్క‌డ సంధ్యారాణి అయితేనే క‌రెక్ట్ అని భావించి ఆమెను నియోజ‌క‌వ‌ర్గ ఇన్ చార్జ్‌గా ఎంపిక చేశారు. 2014లో ఏపీ లో టీడీపీ అధికారంలోకి వ‌చ్చాక బాబు ఆమెకు ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇక ఇప్పుడు ఆమె వ‌చ్చే ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయాలను అందుకున్న పీడిక రాజన్న దొర ను ఓడించి సాలూరు సీటును బాబుకు గిఫ్ట్ గా ఇస్తారేమో ?  చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: