దసరా రోజు అన్ని కోట్లు తాగారా?
తాగితే ఊరుకోము తాగకుండా ఉండలేము.. అన్నవిధంగా రికార్డు స్థాయిలో తాగేశారు తెలంగాణ మందు బాబులు. లాక్డౌన్ ప్రకటించినప్పుడు జరిగిన అమ్మకాలు కన్నా ఎక్కువ స్థాయిలో అమ్మకాలు జరిగి ఖజానా అధికారులు ఆశ్చర్యపోయేలా ఆదాయం అందించి తమ సత్తా చాటుకున్నారు. గతంలో లాక్డౌన్ సమయంలో 130 కోట్ల రూపాయల వ్యాపారం ఒక్కరోజే సాగితే ఈ సారి దసరా సందర్భంగా 200 కోట్ల రూపాయల వ్యాపారం సాగిందన్న వార్త ఒకటి ప్రధాన మీడియాలో హల్ చల్ చేస్తోంది.
దసరా పండుగ రోజు మద్యం అమ్మకాలు ఎలా ఉన్నాయి.. పండుగకు సంబంధించిన రోజుల్లో ఇప్పటిదాకా సాగిన అమ్మకాల విలువ ఎంత అన్నవి చాలా ఆసక్తిగా సాగే ప్రశ్నలు. వీటిపై తెలంగాణ నుంచి ఓ స్పష్టమయిన సమాచారం వస్తోంది. దసరా ఒక్క రోజే అమ్మకాలు ఫుల్లుగా సాగాయి అని అనుకోకూడదు.. పండుగకు సంబంధించి గడిచిన ఐదు రోజుల్లో మద్యం అమ్మకాలు 685 కోట్ల రూపాయల అమ్మకం సాగింది. గత ఏడాది కన్నా ఈ మొత్తం చాలా ఎక్కువ. ఎంత అంటే రెండు వందల ఎనభై కోట్లు ఎక్కు వ. ఇంకేం పండుగ చేసుకోవాల్సిందే.. ఈ వివరం విని ఎక్సైజ్ అధికారులు ఎగిరి గంతేయాల్సిందే!
దసరా సెలవులకు సంబంధించి మొత్తం అన్నింటినీ కలుపుకుని 12 రోజుల్లో పద్నాల్గు వందల కోట్ల రూపాయల వ్యాపారం సాగిందంటే ఆశ్చర్యపోకండి. ఇదంతా తాగుబోతులు మన రాష్ట్రానికి అందించిన సంపద. ఈ నెలాఖరుకు ఈ మొత్తం పెరిగినా పెరుగుతుంది. పదహారు వందల కోట్ల రూ పాయలకు దాటి మద్యం అమ్మకాలు సాగుతాయి. ఆ విధంగా రాష్ట్ర ఖజానాకు ఎన్నడూ లేని విధంగా ఆదాయం అందించి మ ద్యం బాబులు కొత్త రికార్డును నమోదు చేసేందుకు సమాయత్తం అవుతున్నారు. ఇంకా చీప్ లిక్కరు, ఒడిశా మందు, ఇంకా చా లానే ఉన్నాయి..వాటి వ్యాపారం లెక్కేలేదు. మరి! వీటిపై ప్రభుత్వ నియంత్రణ ఎంతన్నది ఇప్పుడెందుకు కానీ తరువాత మా ట్లాడుకుందాం.
పండుగ రోజు బాగా తాగాలి అన్నది మందుబాబుల నియమమా? లేదా తెలంగాణ రాష్ట్ర ఖజానాకు మంచి ఆదాయం ఇవ్వాలన్న సంకల్పమా? ఏదయితేనేం ఒక్క దసరా రోజునే రెండు వందల కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు సాగాయని ఓ అనధికార అంచ నా! ఇంతగా కోట్లు పోసి, ఇల్లూ ఒళ్లూ గుల్ల చేసి తాగి తూలినప్పటికీ ప్రభుత్వాలు మాత్రం అస్సలు ఈ ఆదాయం తమకు లెక్కే కా దని చెబుతుంటాయి. అదే విడ్డూరం. తాము సంప్రదాయ మత్తు పానీయాలను ప్రోత్సహిస్తామే తప్ప మరొకటి ప్రోత్సహించలేం అని పాపం ఆ కల్లు గీత కార్మికులను ఉద్దేశించి చెబుతుంటాయి. ఇవన్నీ విని, చూసి నవ్వుకోవాలి మనం. రెండు వందల కోట్ల రూపా యల ఆదాయంను ప్రభుత్వం ఏం చేస్తుంది.. అభివృద్ధికి వెచ్చిస్తుందా లేదా మద్యం ఔట్ లెట్లు మరికొన్ని తమ పరిధిలో తెరిచి వాటిని ప్రోత్సహిస్తుందా?