బొగ్గు సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా ఆ సమస్యను అధిగమించేందుకు ప్రణాళికలు రూపొందించింది. దీంతో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సరఫరా అవుతోంది. వర్షాలు తగ్గుముఖం పడుతున్న కారణంగా రాబోయే రోజుల్లో బొగ్గు ఉత్పత్తి పెరగనుందని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. దేశం బొగ్గు సంక్షోభం నుంచి బయటపడేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగానే సొంత అవసరాలకోసం కేటాయించిన బొగ్గు ను మళ్లీంచేలా ప్రణాళికలు రచిస్తోంది. దేశవ్యాప్తంగా థర్మల్ విద్యుత్ కేంద్రాలు తీవ్రంగా బొగ్గు కొరతను ఎదుర్కొంటున్న కారణంగా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సాధారణంగా బొగ్గు లేదా ఖనిజాలను ఉత్పత్తి చేసే కంపెనీలకు ప్రత్యేకంగా క్యాప్టివ్ మైన్స్ ఉంటాయి. బొగ్గు కొరతను ఎదుర్కొంటున్న థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఇలాంటి సమయంలో క్యాప్టివ్ మైన్స్ నుంచి బొగ్గును సరఫరా చేసేలా నిర్ణయం తీసుకుంది.
అందులో భాగంగానే ఒడిషాలోని ఎం ఎల్ సి ఇండియాకు చెందిన తాలాబైరా రెండు మూడు గనుల నుంచి బొగ్గును సరఫరా చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇప్పటికే మన కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు కూడా అందాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకుబొగ్గు లోటు తీరనుంది. అంతేకాదు మార్కెట్లోనూ సులువుగా లభించనుంది. దేశ వ్యాప్తంగా కొన్ని బొగ్గు గనులను వరదలు ముంచెత్తడం, మరికొన్ని గనులు మూతపడడం వల్లే సంక్షోభం ఏర్పడిందని కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ తెలిపింది. అయినా ఆందోళన చెందాల్సిన పని లేదని చెబుతోంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్ల తో సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్లు ప్రకటించింది. దేశవ్యాప్తంగా రోజుకు 20 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉందని వర్షాలు తగ్గుతున్న కారణంగా రాబోయే రోజుల్లో బొగ్గు లభ్యత మరింత పెరగనుందని చెప్పింది కేంద్ర ప్రభుత్వం..