హుజూరాబాద్‌లో ఒక్క ఓటు రేటు ఇదే... మైండ్ బ్లాకే...!

VUYYURU SUBHASH
తెలంగాణ లోని ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లా హుజూరాబాద్ లో ఎన్నికల వాతావరణం ఓ రేంజ్ లో హీటెక్కుతోంది. గెలుపు బీజేపీ, టీఆర్ ఎస్ ల‌కు కీల‌కం కావ‌డంతో ఈ రెండు పార్టీలు ఒక్క ఓటును కూడా వదిలపెట్టకుండా ఓట‌ర్ల కోసం జల్లెడ పడుతున్నాయి. ఒక్కో ఓటుకు పది వేల నుంచి పదిహేను వేల వరకూ ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇంకా చెప్పాలంటే ఒక్క కుటుంబంలో 15 ఓట్లు ఉంటే గంప గుత్త‌గా రు. 3 లక్ష‌ల వ‌ర‌కు కూడా ఇచ్చేలా ఒప్పందాలు కుదురు తున్నాయంటున్నారు. ఇక ఆయా గ్రామాల్లో ఉన్న స‌మ‌స్య‌లు గుర్తించి... మేం గెలిస్తే వెంట‌నే ఈ స‌మ‌స్య‌లు పరిష్క రిస్తామంటూ అధికార పార్టీ నేత‌లు ప్రామిస‌రీ నోట్ల మీద‌, బాండ్ పేప‌ర్ల మీద రాసి మ‌రీ సంత‌కాలు పెడుతున్నార‌ట‌.

ఇక తెలంగాణ లో గ‌తంలో పాలేరు, నారాయ‌ణ్ ఖేడ్ , హుజూర్ న‌గ‌ర్‌, దుబ్బాక ఉప ఎన్నిక‌లు జ‌రిగాయి. అయితే ఇప్పుడు హుజూరాబాద్ లో జ‌రుగుతోన్న ఉప ఎన్నిక మాత్రం పై ఉప ఎన్నిక‌ల‌ను మించి అత్యంత కాస్ట్ లీ ఉప ఎన్నిక కానుంది. పై ఉప ఎన్నిక‌ల్లోనూ అధికార పార్టీ అప్ప‌ట్లో గెలుపు కోసం కోట్లాది రూపాయ‌లు వెద జ‌ల్లింద‌నే టాక్ ఉంది. అయితే ఇప్పుడు నిన్న‌టి వ‌ర‌కు కేసీఆర్ కేబినెట్లో మంత్రి గా ఉండ‌డంతో పాటు బ‌య‌ట‌కు వ‌చ్చి కేసీఆర్ నే స‌వాల్ చేసిన ఈట‌ల కావ‌డం.. ఆయ‌న్ను ఎలాగైనా ఓడించాల‌ని క‌సితో ఉన్నారు.

దీంతో హుజూరా బాద్ ఉప ఎన్నిక మామూలుగా జ‌రిగేలా లేదు. ఇక ఒక ఇంట్లో 10 మంది ఉంటే వారికి డ‌బ్బుకు డ‌బ్బుతో పాటు ఖ‌రీదైన గిఫ్ట్ లు.. పొట్టేలు కూడా ఇస్తున్నార‌ట‌. ఇప్పుడు ఈ ఉప ఎన్నిక నేప‌థ్యంలో మేక‌ల‌కు, పొట్టేళ్ల‌కు డిమాండ్ పెరుగుతోంద‌ని అంటున్నారు. అలాగే తాము డబ్బులిచ్చిన ఓటర్లు ఖచ్చితంగా త‌మ‌కే ఓటు వేయాలని వారిచేత ప్రమాణా లు కూడా చేయించుకుంటున్నారు.  బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ మాత్రం త‌న‌ను ఓడించేందుకు టీఆర్ఎస్ ఓటుకు ఇరవై వేలు ఇస్తుందని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: