మ‌ర‌ద‌లు గారికి షాక్ ఇచ్చిన చంద్ర‌బాబు...!

VUYYURU SUBHASH
తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత దివంగ‌త మాజీ ముఖ్య మంత్రి... ఎన్టీ రామారావు ఎందరికో రాజకీయ జీవితం ఇచ్చారు.. ఎంతో మంది బ‌డుగు , బ‌ల‌హీన వ‌ర్గాల‌కు అవకాశాలు కల్పించారు. వారిలో అనేక మంది నేటికీ రాజకీయాల్లో కొనసాగుతున్నారు.. నాలుగు ద‌శాబ్దాలు దాటు తోన్న వేళ వారి వార‌సులు కూడా రాజ‌కీయాల్లోకి వ‌చ్చి స‌క్సెస్ అవుతున్నారు. పార్టీ ఆవిర్భ వించిన ప్ప‌టి నుంచి ఉన్న‌ కొన్ని కుటుంబాలు పార్టీనే నమ్ముకుని పనిచేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు పార్టీ క‌ష్ట‌కాలంలో ఉన్న వేళ చంద్ర‌బాబు అలాంటి వారిని గుర్తించి మ‌రీ తెర మీద‌కు తీసుకు వ‌స్తున్నారు. తాజాగా చంద్ర‌బాబు సొంత జిల్లా చిత్తూరు లోని పుంగనూరు నియోజకవర్గం ఇన్ ఛార్జి చల్లా రామచంద్రారెడ్డి నియామకం చూస్తేనే ఈ విష‌యం స్ప‌ష్టంగా తెలుస్తుంది.
ఇక్క‌డ గ‌త ఎన్నిక‌ల‌లో అప్ప‌టి మంత్రి అమ‌ర్ నాథ్ రెడ్డి మ‌ర‌ద‌లు అయిన అనీషా రెడ్డి పోటీ చేశారు. ప్ర‌స్తుత వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రా రెడ్డిపై పోటీ చేసిన అనీషా చిత్తు చిత్తు గా ఓడిపోయారు. అయితే గ‌త ఎన్నిక ల‌లో ఓట‌మి అనంత‌రం ఆమె యాక్టివ్ గా లేరు . చివ‌ర‌కు స‌ర్పంచ్ ఎన్నిక‌ల‌తో పాటు మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌లో నియోజ‌క‌వ‌ర్గం అంతా వైసీపీ ఏక‌గ్రీవంగా క్లీన్ స్వీప్ చేసేసింది. దీంతో ఇప్పుడు బాబు ఆమెను త‌ప్పించి చల్లా రామచంద్రారెడ్డిని ఇన్ ఛార్జిగా నియమించారు.
చల్లా రామచంద్రారెడ్డి కుటుంబం టీడీపీలో పార్టీ ఆవిర్భావం నుంచి క్రియాశీలకంగా ఉంటోంది. చల్లా రామచంద్రారెడ్డి తండ్రి చల్లా ప్రభాకర్ రెడ్డి టీడీపీ తరుపున పీలేరు నియోజకవర్గం నుంచి రెండుసార్లు  1983, 1985లో వ‌రుస‌గా ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ కుటుంబం ఆ త‌ర్వాత ఎలాంటి ప‌ద‌వులు చేప‌ట్ట లేదు. అయితే రొంపిచ‌ర్ల ఎంపీపీ ప‌ద‌విని మాత్ర‌మే ఆ కుటుంబం పొందింది. ఆ మండ‌లంలో ఆ కుటుంబానికి ఇప్ప‌ట‌కీ మంచి గుర్తింపు ఉంది.
ఇక పెద్దిరెడ్డి లాంటి బ‌ల‌మైన నేత‌ను ఢీ కొట్టాలంటే అనీషా వ‌ల్ల కాద‌ని.. అక్క‌డ మంచి పేరున్న చ‌ల్లా రామ‌చంద్రా రెడ్డి అలియాస్ చ‌ల్లా బాబును చంద్ర‌బాబు రంగంలోకి దింపార‌ని తెలుస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: