దిశ స్టేషను కహానీ : జగన్ పోలీసు.. అత్యాచార నిందితుడు?
మహిళలకూ, వారి మాన, ప్రాణాలకు రక్షణ ఇవ్వాల్సిన పోలీసు ఓ వివాదంలో ఇరుక్కున్నాడు. జగన్ సర్కారులో దిశ స్టేషన్ పనితీరు ఎలా ఉందో చెప్పేందుకు రేపటి వేళ ఇదొక మచ్చుతునక కానుంది. నిందితుడు ఓ హెడ్ కానిస్టేబుల్.ఏ ఆర్ కానిస్టేబుల్ గా పనిచేసిన భర్త ఆకస్మిక మరణంతో ఒంటరైంది. ఇదే అదునుగా ఆమెపై అత్యాచారం చేయడమే కాకుండా ఈ విషయం బయటకు చెబితే వ్యక్తిగత ఫొటోలు అన్నీ సోషల్ మీడియాలో అప్ చేస్తానని బెదిరించాడు. ఆఖరికి నిందితురాలు ఏలూరు దిశ స్టేషన్ ను ఆశ్రయించింది. జగన్ సర్కారు ఆయనపై ఏం చర్య తీసుకోనుంది?
స్టేషన్ లో కొత్త కానిస్టేబుల్ వచ్చాడు. కాదు పాత కానిస్టేబులే ఉన్నాడు. కానీ ఆయన ఎప్పటిలా లేడు. వివాదాల్లో ఉన్నాడు. కానీ ఆయన ఎప్పటిలా లేడు.. అత్యాచారం చేసి ఓ బాధితురాలిని నిరంతరం వేధిస్తున్నాడన్న ఆరోపణల్లో ఉన్నాడు. ఈ కథ పశ్చిమ గోదావరి ప్రాంతానికి చెందినది. ప్రశాంతతకు ఆనవాలుగా నిలిచే ఈ తీరంలో ఇలాంటి కథలు ఎప్పుడూ వినలేదు కానీ ఇదిగో ఇదే పెద్ద సమస్యగా మారనుంది. ధర్మాజీగూడెం స్టేషన్ హెడ్ కానిస్టేబులు వార్తల హెడ్డింగుల్లో నిలిచాడు. ఆయన చేసిన తప్పిదంపై ఇప్పుడు విచారణ సాగుతోంది. ఆయన ఓ ఏ ఆర్ కానిస్టేబుల్ భార్యపై అత్యాచారం చేశాడన్న ఆరోపణల్లో ఉన్నాడు. ఆ ఏ ఆర్ కానిస్టేబుల్ మరణించండంతో, ఒంటరిగా ఉన్న మహిళపై ధర్మాజీ గూడెం హెడ్ కానిస్టేబుల్ ఇలాంటి ఘాతుకానికి పాల్పడ్డాడు. కేసు విచారణ సాగుతోంది. నిందితుడితో సహా ఆయన కుటుంబంపై కూడా పలు కేసులు ఏలూరు దిశ పోలీసు స్టేషన్లో నమోదైనప్ప టికీ విచారణలో తేలే నిజాలేంటన్నవి ఇప్పుడిక ఆసక్తిదాయకం. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితు డ్ని, ఆయన చర్యలను ప్రశ్నిస్తున్నారు.