వాట్సాప్ లేకపోతే.. యుగాంతం తప్పదా?

praveen
అప్పుడప్పుడు యుగాంతానికి సంబంధించిన వార్తలు వస్తూ ఉంటాయి. ఇక మరికొన్ని రోజుల్లో యుగాంతం రాబోతుంది అని.. దీంతో ప్రపంచం మొత్తం నాశనం కాబోతుంది అంటూ అప్పట్లో ఎన్నో వార్తలు జనాలను ఆందోళన కలిగించాయి.  ఇక ఇలా యుగాంతం అనే అంశంపై కొన్ని సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.  యుగాంతం వస్తుంది భూమి మొత్తం పెద్దలు అవుతుందని..  భూమిపై ఉన్న మనుషులందరూ చనిపోతారని అప్పట్లో వార్తలు ఎంతలా సంచలనం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

 అయితే ఇలా శాస్త్రవేత్తలు చెప్పిన యుగాంతం కేవలం మాటలకు మాత్రమే పరిమితం అయింది. ఇకపోతే ఇటీవల ఇండియాలో ఒక చిన్నపాటి యుగాంతం వచ్చింది.  అదేంటి ఎవరికీ తెలియకుండా యుగాంతం రావడం ఏంటి అని ఆశ్చర్య పోతున్నారు కదా..  ఈసారి వచ్చింది భూమి బద్దలయ్యే యుగాంతం కాదు.. మనుషుల మెదళ్లు బద్దలయ్యే యుగాంతం.  ఇటీవలే మనుషులందరినీ బానిసలుగా మార్చుకున్న వాట్సాప్ ఫేస్బుక్ ఇంస్టాగ్రామ్ సేవలు ఒక్కసారిగా ఆగిపోయాయ్.  దీంతో జనజీవనం మొత్తం అతలాకుతలం అయిపోయింది.  ఒక్కసారిగా ఈ మూడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఆగిపోవడంతో ఏం చేయాలో అర్థం కాక పిచ్చిపిచ్చిగా కూడా ప్రవర్తించారు ఎంతోమంది జనాలు.

 అంతేకాదు ఇక ఈ మూడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ సేవలు ఎప్పుడేప్పుడు ప్రారంభం అవుతాయ అని వెయ్యి కళ్ళతో అర చేతిలో ఫోన్ పట్టుకొని నిరీక్షణగా ఎదురు చూసారు.  అయితే ఇలాంటి పరిస్థితులే భవిష్యతు లో కొనసాగితే యుగాంతం తప్పదు అని అంటున్నారు నిపుణులు. అయితే ఈసారి శాస్త్రవేత్తలు చెప్పినట్లుగా భూమి బద్దలు అయ్యి మనుషులు చనిపోయే యుగాంతం కాదని...  ఏకంగా సోషల్ మీడియా సేవలు ఆగిపోయి ఎంతోమంది మెదళ్ళు పగిలిపోయి ప్రాణాలు కోల్పోయే యుగాంతం వచ్చే ప్రమాదం ఉంది అంటూ హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా సోషల్ మీడియాకు బానిసలుగా కాకుండా అవసరానికి మాత్రమే ఉపయోగిస్తే బాగుంటుంది అని సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: