భారీ సంక్షోభం.. పాకిస్తాన్ కి గడ్డు పరిస్థితి?

praveen
చెరపకురా చెడేవు అనే సామెత గురించి దాదాపుగా అందరికీ తెలిసే ఉంటుంది..  మనం ఒకరిని చెడ గొట్టాలని ప్రయత్నిస్తే చివరికి చెడి పోయేది మనమే అన్నది ఈ సామెత యొక్క అర్థం. అయితే ఇప్పుడు పాకిస్థాన్ విషయం లో ఈ సామెత నిజం అవుతుంది అన్నది అర్థం అవుతుంది. ఎందుకంటే ఉగ్రవాదాన్ని పెంచి పోషించి..  భారత్లో అల్లకల్లోల పరిస్థితులు సృష్టించడానికి పాకిస్తాన్ ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటుంది.  ఇదే సమయం లో పాకిస్థాన్ ప్రజల ప్రయోజనాలను కూడా గాలి కొదిలేస్తుంది. ఇక అక్కడ అభివృద్ధి అయితే అసలు పట్టించు కోదు.

 కేవలం ఉగ్ర వాదులను పెంచి పోషించడం భారత్ లోకి అక్రమం గా చొరబడేలా చేసి మారణ హోమాలు సృష్టించడం పైన ఎప్పుడు దృష్టి పెడుతూ ఉంటుంది.  ఇలా భారత్ ని చెడ గొట్టడానికి ప్రయత్నించాలి అనుకున్న పాకిస్థాన్కు ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఏర్పడుతున్నాయి. రోజు రోజుకు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ సంక్షోభం లో కూరుకు పోతోంది. ఇప్పటికే డబ్బులు లేక పాకిస్థాన్ లోని ప్రభుత్వ భవనా లను సైతం అద్దెకు ఇచ్చే పరిస్థితి వచ్చింది. అదే సమయం లో అటు పాకిస్తాన్ వృద్ధి రేటు కూడా రోజు రోజుకు పడి పోతుంది.

 ఇక పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ రోజు రోజుకు కుప్ప కూలి పోతుంది అన్నదానికి ఇక ఇటీవల జరిగిన ఘటనే నిదర్శనం గా మారి పోయింది.  ఇటీవలే పాకిస్తాన్ రూపాయి విలువ అమెరికా డాలర్ తో పోల్చి చూస్తే 170 రూపాయలకు చేరింది. భారత్లో  అమెరికా డాలరు విలువ 74 రూపాయల వరకు ఉంటే.. ఇక పాకిస్తాన్ లో మాత్రం 170 రూపాయలకు చేరింది. అంతలా అక్కడి పరిస్థితి దారుణంగా మారిపోయింది.  పాకిస్తాన్ పరిస్థితి రోజురోజుకు అధ్వానంగా మారుతున్న అక్కడి ప్రభుత్వానికి మాత్రం ఇంకా కనువిప్పు కావడం లేదు అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: