మూడు ఎమ్మెల్సీలు ఇస్తేనే జగన్‌కు ఓట్లేస్తాం... అల్టిమేటం ఇచ్చేశారు...!
కానీ, ఇప్పుడు.. తాజాగా ఏపీ స్టేట్ ఇంటిగ్రేటెడ్(పొలిటికల్) క్రిస్టియన్ కౌన్సిల్ నిరసన స్వరం వినిపించింది. గత ఎన్నికల్లో వైసీపీకి ఓట్లేసి గెలిపించిన తమకు ఏం చేస్తున్నారని.. జగన్ ను నిలదీసింది. కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వడం లేదని కౌన్సిల్ వ్యవస్థాపకుడు జోపెఫ్ విమర్శించడం ఆసక్తిగా మారింది. ఇప్పటికే ఉన్న విమర్శలకు ఇది మరింత ఆజ్యం పోసేలా ఉందని అంటున్నారు పరిశీలకులు. జోసెఫ్ అంతటితో ఆగకుండా.. వైసీపీ అధికారంలోకి వస్తే తమకు న్యాయం చేస్తారని ఆశించామన్నారు.
కానీ, క్రైస్తవులకు తీరని అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయంగా క్రైస్తవులకు జరుగుతున్న అన్యాయంపై ఇక నుంచి పోరాటానికి దిగుతామని చెప్పారు. ఎస్సీలంటే క్రైస్తవులనే అభిప్రాయంతో ఉన్నారని.. నాన్ క్రిస్టియన్స్‌కు పదవులు కట్టబెడుతున్నారని అన్నారు. వైసీపీ విజయం గత ఎన్నికల్లో తామంతా ఎంతో కష్టపడ్డామని.. అయితే.. తమకు కనీసం గుర్తింపు ఇవ్వడం లేదని.. అప్పాయింట్‌మెంట్ కూడా ఇవ్వడం లేని ఆరోపించారు.
తమకు కనీసం మూడు ఎమ్మెల్సీ పదవులనైనా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక నుంచి క్రిస్టియన్ కమ్యూనిటీకి పని చేస్తేనే వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓట్లేస్తామని స్పష్టం చేశారు. ఈ దిశగా క్రైస్తవుల్లో చైతన్యం తీసుకువచ్చి ఒక తాటి మీదకు తెస్తామన్నారు. మొత్తానికి ఈ పరిణామం గమనిస్తే.. జగన్‌కు సెగ ప్రారంభమైందా..? అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.