తీవ్ర ఒత్తిడిలో వెస్ట్ బెంగాల్ సీఎం... గెలుస్తుందా ?

VAMSI
పశ్చిమ బెంగాల్ లో ఆసక్తికర సమరానికి నేడు తెరలేచింది. ఆరు నెలల ముందు వెస్ట్ బెంగాల్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ విజయకేతనాన్ని ఎగరవేసింది. అయితే ముఖ్యమంత్రి అభ్యర్థి అయిన మమతా బెనర్జీ మాత్రం తాను పోటీ చేసిన నందిగ్రామ్ నియోజకవర్గంలో ఓటమి పాలయింది. అయినా సీఎం పీఠాన్ని అధిష్టించారు. అయితే రాజ్యాంగం ప్రకారం ఆరు నెలలలోపల తిరిగి ఎమ్మెల్యే గా గెలవాల్సి ఉంది. అందుకే ఇప్పుడు భవానీపూర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీకి దిగారు. ఈ రోజు దానికి సంబంధించిన ఓటింగ్ మొదలయింది. అయితే ఈ ఎన్నికలో భారతీయ జనతా పార్టీ నుండి గట్టి పోటీ ఎదురుకానుంది. బీజేపీ తరపున ప్రముఖ న్యాయవాది మరియు బీజేపీ లీడర్ అయిన ప్రియాంక టిబ్రేవాల్ నిలబడ్డారు.

ఇప్పుడు రాష్ట్రమంతటా ఈ ఉప ఎన్నికపై ప్రత్యేక దృష్టి నెలకొంది. ఈ ఉప ఎన్నికలో మమతా విజయ సాధిస్తేనే సీఎంగా కొనసాగుతారు. లేదంటే రాజీనామా చేయాల్సి వస్తుంది. దీనితో ఈ ఉప ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు దీదీ.  ఈ ఎన్నికలో ప్రముఖ  ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ దీదీకి సపోర్ట్ గా నిలిచారు. ఎలక్షన్ సంఘం అన్ని భద్రతా చర్యలను ఏర్పాటు చేసింది. ఎన్నికలు జరిగే భవానీపూర్ అంతటా 144  సెక్షన్ అమలులో ఉంచింది.  అయితే ఈ ఎన్నికలో దీదీ గెలుస్తుందా ? లేదా బీజేపీ చరిత్ర సృష్టిస్తుందా అన్న విషయంపై చర్చలు జరుగుతున్నాయి. కానీ ప్రజలు ఎప్పుడు ఎవరికి ఎలా షాక్ ఇస్తారో ఎవ్వరూ ఊహించలేము.


మమతా బెనర్జీ చేసిన ఒక చిన్న పొరపాటు కారణంగా ఇప్పుడు సీఎం కుర్చీ చేజారిపోయే పరిస్థితి. ఎవ్వరైనా రెండు చోట్ల నామినేషన్ వేస్తారు. కానీ అతి విశ్వాసానికి పోయి కేవలం ఒక్క చోటే నామినేషన్ వేశారు. అదికాస్తా బెడిసి కొట్టింది. కాబట్టి మమతా ఇప్పుడు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. టీఎంసీ పార్టీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా ఈ ఎన్నికల ఫలితం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ రోజు సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ కొనసాగుతుంది. అక్టోబర్ 3 వతేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. మరి ఏమి జరగనుందో ఎదురుచూద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: