బద్వేలు టాక్ : టీడీపీకి వణుకు ఎందుకు?

RATNA KISHORE
భూమా నాగిరెడ్డి మరణం తరువాత నంద్యాల ఉప ఎన్నికలు వచ్చాయి. అవి తప్పని సరై పోటీ చేశాం. ఈ సారి అలాకాదు కాస్త ఆలోచించండి - వైసీపి ప్రభుత్వం టీడీపీ విన్నవించిన విధానం ఇది. కానీ ఆరోజు హోరాహోరి పోరు జరిగి ఆఖరికి పోరులో టీడీపీ విన్నర్ అయింది. భూమా బ్రహ్మానంద రెడ్డి గెలిచి పీఎం నరేంద్ర మోడీ నుంచి కూడా అభినందనలు అందుకున్నారు. ఇప్పుడు బద్వేలు ఉప ఎన్నిక ఇప్పుడూ అదే సీన్ రిపీట్ అవుతుందా? అధికార పక్షానికి ఇది శాంపుల్ టెస్టు అవుతుందా?


మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరో తప్పిదానికి శ్రీకారం దిద్దారు. తాను ఓ మెట్టు దిగి వచ్చి బద్వేలు స్థానానికి పోటీ చేయ కుండా ఉంటే ఎంతో బాగుంటుందని అంతా అంటున్నారు. కానీ ఆయన మానవతా దృక్పథం కన్నా రాజకీయ దృక్పథం బలంగా ఉండడం తో ఈ సారి కూడా ఉప ఎన్నికకు సై అన్నారు. ఇప్పుడున్న స్థితిలో తెలుగుదేశం క్యాడర్ అంతా అధికార పార్టీపై ఆశించిన పోరాటం చేసినా పసుపు జెండాలు ఎగరవు. అయినప్పటికీ ఎందుకని వదిలేయడం అన్న ఆలోచనతో బాబు వ్యూహం ఉందని తెలుస్తోంది. వాస్తవానికి 2001 వరకే టీడీపీ ఇక్కడ గెలిచిందని తరువాత ఎన్నడూ గెలవలేదని లెక్కలు చెబుతున్నాయి.రిజర్వుడు స్థానంగా మారాక ఎన్నికల ఫలాలు ఏవీ టీడీపీని వరించలేదనే రాజకీయ పరిశీలకులు వెల్లడిస్తున్నారు. ఇప్పుడేం చేస్తారో?


కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నిక టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందా లేదా నామ మాత్ర పోటీకే పరిమితం అవుతుందా ? అన్న ది  రాజకీయ వర్గాలను కదలిస్తున్న ప్రశ్న. బద్వేలులో గతంలో పోటీ చేసిన రాజశేఖర్ కే మళ్లీ టికెట్ ఇచ్చి ఏం చెప్పాలనుకుంటుం ది? చంద్రబాబు హయాంలో కడప టీడీపీ మళ్లీ బలోపేతం అయిందన్న సంకేతాలు ఇవ్వగలరా? ఇవీ ఇప్పుడు పొలిటికల్ టాపిక్స్.


బద్వేలు ఉప ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ రావడంతో వైసీపీ ప్రభుత్వ పెద్ద సజ్జల రామకృష్ణా రెడ్డి ఏకగ్రీవ ప్రతిపాదన తెచ్చా రు. తాము ఎవ్వరినీ పోటీ చేయొద్దు అని అనడం లేదు కానీ గత సంప్రదాయాలను పాటించాలని కోరారు. కానీ ఇందుకు టీడీపీ సి ద్ధంగా లేదు. ఎలా అయినా పోటీ చేసి గట్టి ఫలితం ఒకటి రాబట్టాలని యోచిస్తోంది. మరి! సానభూతి పరంగా చనిపోయిన ఎమ్మె ల్యే వైపే ప్రజలు కానీ ఓటర్లు కానీ ఉంటారు. అలాంటప్పుడు టీడీపీ పంతం ఎలా నెరవేరుతుంది. పోనీ ఈ ఎన్నిక ఫలితం ఒకవేళ టీడీపీకి అనుకూలంగా వచ్చినా చంద్రబాబు సాధించేది ఏమీ ఉండదు. దీన్నొక రాజకీయ అస్త్రంగా వినియోగించుకునేందుకు వీల్లేదు. అలాంటప్పుడు పోటీ పెట్టి ఏం సాధిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: