కాపు ముద్ర కోసం పవన్ కుతూహలం... చాలా పెద్ద ప్లాన్ వేశాడే ?
అదే వర్గానికి చెందిన వంగవీటి రంగా హత్యానాంతరం ఆ తర్వాత దాసరి నారాయణ రావు మాత్రమే కేంద్ర మంత్రిగా ఎదిగారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి 2009 ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయారు. ఆయనను నమ్ముకున్న కాపు నేతలు చాలా మంది నష్టపోయారు. ఆ తర్వాత ఆయన సోదరుడు పవన్ కల్యాన్ జనసేన పార్టీ పెట్టారు. ఆయన కూడా గత ఎన్నికలలో పోటీ చేసి మళ్లీ చిత్తుగా ఓడిపోయారు. విచిత్రం ఏంటంటే ఈ ఇద్దరు కూడా కాపు వర్గం వారే. అయితే వీరు తాము పోటీ చేసిన చోటే ఎమ్మెల్యేలుగా కూడా ఓడిపోయారు. ఇక పవన్ ఇప్పుడిప్పుడే మళ్లీ రాజకీయంగా యాక్టివ్ అవుతున్నారు.
నిన్నటి వరకు పవన్ తనపై కాపు ముద్ర పడితే నష్టం అని భావించారు. అయితే ఇప్పుడు కులం ముద్ర లేకపోతే నష్టమని పవన్ భావిస్తున్నట్టే కనిపిస్తోంది. టీడీపీపై కమ్మ సామాజికవర్గం ముద్ర, వైసీపీ రెడ్డి సామాజికవర్గం ముద్ర ఏపీలో ఉన్నాయి. అయితే ఇప్పుడు తన సామాజిక వర్గాన్ని పూర్తిగా ఓన్ చేసుకోవాలంటే కాపు ముద్ర తనపై పడక తప్పదని పవన్ భావిస్తున్నారా ? అంటే ఆ పార్టీ నేతలే అవునని అంటున్నారు. పవన్ వైఖరి కారణంగా గత ఎన్నికలలోనూ చాలా మంది కాపులు జనసేనకు సపోర్ట్ చేయలేదు.
అందుకే గోదావరి జిల్లాలలోనూ జనసేన గెలవలేదు. ఇక ఇప్పుడు కాపులను పూర్తిగా తన వైపు టర్న్ చేసుకుంటేనే ప్లస్ అవుతుందని పవన్ భావిస్తున్నట్టే కనిపిస్తోంది. అందుకే కాపు రిజర్వేషన్ల పై ఇక పవన్ పోరాడాలని భావిస్తున్నట్లే ఆయన మాటలు చెపుతున్నాయి. మరి పవన్ ప్లాన్లు ఎంత వరకు సక్సెస్ అవుతాయో ? చూడాలి.