చీర కట్టుకున్న కస్టమర్.. ఊహించని షాక్ ఇచ్చిన హోటల్ సిబ్బంది?

praveen
భారతీయ సాంప్రదాయం ఎంత గొప్పదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  ఎన్ని మోడ్రాన్ డ్రెస్సులు వేసుకున్నప్పటికీ భారతీయ సాంప్రదాయం ప్రకారం మహిళల చీరకట్టు లో కనిపిస్తే అంతకంటే అందంగా ఇంకెప్పుడూ కనిపించరు.  చీరకట్టుతో ఎక్కడికి వెళ్ళినా వాళ్లు భారతీయులు అని అందరూ ఠక్కున గుర్తు పట్టేస్తా ఉంటారు. అంతలా మన దేశ చీరకట్టుకు ప్రాధాన్యత ఉంది.  ఈ క్రమంలోనే ఎంతో మంది విదేశీ పౌరులు సైతం భారతీయ సాంప్రదాయాలను నచ్చి తమ దేశంలో కాకుండా భారతీయ సాంప్రదాయ ప్రకారం పెళ్లి చేసుకున్న ఘటనలు కూడా ఇప్పటికే ఎన్నోసార్లు వెలుగులోకి వచ్చాయి. ఇలా దేశ ప్రజలే భారతీయ సంప్రదాయాన్ని వదిలేస్తుంటే విదేశీ పౌరులు భారతీయ సంప్రదాయాన్ని ఇష్టపడుతూ మన సాంప్రదాయంలో పెళ్లి చేసుకోవడం గొప్పగా అనిపిస్తూ ఉంటుంది.

 మన దేశంలో మన సాంప్రదాయాన్ని మరీ ముఖ్యంగా చీర కట్టుకుని ఎంత చులకనగా చూస్తున్నారు అనే విషయం ఇక్కడ జరిగిన ఘటనతో అర్థమవుతుంది. నేటి రోజుల్లో మోడ్రన్ డ్రెస్సులకు ఉన్నంత గౌరవం చీరకట్టుకు అసలు లేదు అన్నది ఇక్కడ ఒక మహిళకు జరిగిన అవమానంతో నిరూపితం అయింది. సాధారణంగా స్టార్ హోటల్లో కస్టమర్లను ఎంత బాగా చూసుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చూస్తూ ఉంటారు. కానీ ఇక్కడ హోటల్ సిబ్బంది మాత్రం ఏకంగా హోటల్ వరకు వచ్చిన మహిళను లోపలికి పంపించలేదు.  సారీ మేడం మిమ్మల్ని లోపలికి పంపించలేదు అంటూ వెనక్కి తిరిగి పంపించారు.

 దీనికి కారణం ఏంటో తెలుసా.. ఆమె భారతీయ సాంప్రదాయం ప్రకారం చీరకట్టులో ఉండడమే. ఢిల్లీలోని అక్విలా రెస్టారెంట్లో చీరకట్టుకుంది అనే కారణంతో హోటల్ సిబ్బంది ఒక మహిళను లోనికి అనుమతించలేదు. హోటల్ గేటు వద్ద నిలబడి మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో కాల్ తో వైరల్ గా మారిపోయింది. మహిళా భోజనం చేసేందుకు రెస్టారెంట్కు వెళ్లగా ఎంట్రీ లేదని హోటల్ సిబ్బంది చెప్పారు. ఎందుకు అని ప్రశ్నించగా మా రెస్టారెంట్ డ్రెస్ కోడ్ ప్రకారం చీర కట్టుకున్న వారిని లోనికి అనుమతించలేదు అంటూ తెలిపారు హోటల్ సిబ్బంది.  అంతేకాదు చీర స్మార్ట్ కాజువల్స్ కావని అంటూ హోటల్ సిబ్బంది చెప్పుకొచ్చారు. ఇలా దేశ సాంప్రదాయమైన చీరకట్టును దేశ రాజధాని ఢిల్లీలోనే అవమానించారంటూ ఎంతోమంది ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: