శ్రీకాకుళం వార్త : గ్రానైట్ తవ్వకాలే వారికి మరణ శాసనం!

RATNA KISHORE
. క్వారీలు అనుమతులు లేకుండా నడిచినా, అనుమతులు ఉన్నా సరైన పర్యవేక్షణ లేని కారణంగా అక్కడ చేపట్టాల్సిన భద్రతా చర్యలు చేపట్టకపోయినా అవన్నీ ఎవ్వరికీ పట్టడం లేదు.
 
పైకి రాజకీయ పార్టీలు కొట్టుకుంటాయి. తిట్టుకుంటాయి. కానీ క్వారీ కార్మికుల విషయమై ఎవ్వరూ పోరాడరు. టీడీపీ నోరెత్తదు. వైసీపీ స్పందించదు. తాజాగా నందిగాం, సొం టినూరు క్వారీలో జరిగిన ప్రమాదం కారణంగా ఇద్దరు కూలీలు చనిపోతే టీడీపీ కనీసం అడగలేదు. అచ్చెన్న ఇలాకాలో జరిగిన ఘటన అయినప్పటికీ ఆయన నుంచి స్టేట్మెం ట్ లేనే లేదు. క్వారీ యజమానులకు ఎటువంటి అడ్డూ అదుపూ లేని కారణంగానే వారిలా రెచ్చిపోతున్నారని, ఫలితం విలువయిన ప్రాణాలకు లెక్కలేదని వాపోతు న్నారు. రెండు రాజకీయ పార్టీలూ ఇప్పటిదాకా క్వారీ కార్మికుల బాగోగుల కోసం మాట్లాడిందే లేదు. దీంతో కూలీల జీవితం దయనీయం అవుతోంది.


టెక్కలి, నందిగాం మండలాల్లో గ్రానైట్ తవ్వకాలతో కొందరు మృత్యువాత పడుతున్నారు. కూలీలకు తగిన రక్షణ ఇవ్వకపోవడంతో పేలుళ్ల సమయంలోనూ, తరువాత చేపట్టే పనుల్లోనూ అమాయక ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ప్రభుత్వం తరఫున మరణించిన వారికి అందుతున్న సాయం కూడా అంతంత మాత్రమే! క్వారీ యజమానులు కోట్లు గడిస్తుంటే, కూలీలు మాత్రం తమ ప్రాణాలు ఫణంగా పెట్టి ఇక్కడ పనిచేస్తున్నారు. క్వారీలు అనుమతులు లేకుండా నడిచినా, అనుమతులు ఉన్నా సరైన పర్యవేక్షణ లేని కారణంగా అక్కడ చేపట్టాల్సిన భద్రతా చర్యలు చేపట్టకపోయినా అవన్నీ ఎవ్వరికీ పట్టడం లేదు.


దీంతో ఈ సమస్య రోజురోజుకీ జఠిలం అవుతోంది. ముఖ్యంగా నీలి గ్రానైట్ కు ఉన్న విపరీతమైన క్రేజ్ కారణంగా ఈ ప్రాంతంలో రాజకీయ జోక్యం అధికంగా కనిపిస్తోంది. గ్రానైట్ తవ్వకాలతో అనుబంధం ఉన్న నాయకులు తమ హవాను కొనసాగిం చేందుకు, ఇక్కడి వ్యాపారులతో నిత్యం మంచి అనుబంధం కొనసాగిస్తూ, వారితోనే ఎన్నికల సమయంలో పెట్టుబడులు పెట్టిస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap

సంబంధిత వార్తలు: