భార్యా భర్తల గెలుపు : టెక్కలి శీనుకు వాణి తోడైంది!

RATNA KISHORE
అచ్చెన్న అనుకుంటే ఏమయినా అవుతుంది అనుకునే రోజులు పోయాయి అని వైసీపీ అంటోంది. అలా అనుకున్న ప్రతిసారీ వై సీపీ తరఫున ఎదురు దెబ్బలే తిన్నారని కూడా అంటోంది. ఈ క్రమంలో దువ్వాడ కుటుంబం కాస్త పుంజుకుని రాజకీయంగా నిల దొక్కుకుంది. దువ్వాడ శ్రీను దూకుడు కారణంగానే జగన్ ఆయనను ప్రోత్సహించిన ప్రస్తుత ఎన్నికల నేపథ్యంలో తమ పట్టు ను మరింత పెంచుకునేందుకు శ్రీను పరితపించి, స్థానిక రాజకీయంలో చక్రం తిప్పారు. వాస్తవానికి దువ్వాడ శ్రీనును అచ్చెన్న నిలువరించిన ఘటనల్లో నియోజకవర్గం మొత్తం రెండుగా విడిపోయి భేదాభిప్రాయాలలో కొట్టుకుంది. ఇప్పుడిక అలాంటివి ఉంటాయో ఉండవో కానీ కాళింగ సామాజికవర్గం తాము అనుకున్న పదవుల సాకారంలో ఏదేమైనప్పటికీ పై చేయి సాధించింది.

దువ్వాడ శ్రీను, దువ్వాడ వాణి దంపతులు టెక్కలి నియోజకవర్గం కేంద్రంగా రాజకీయాలు చేస్తున్నవారు. ఒకరు ఎమ్మెల్సీ, మరొకరు జెడ్పీటీసీ. కింజరాపు కుటుంబం కారణంగానే తాము ఆర్థికంగా ఎన్నో ఆటుపోట్లు చూశామని గత ఎన్నికల్లో ఎంపీగా తాను పోటీ చేసినా ఓడిపోయేందుకు సొంత పార్టీ మనుషులే కారణం అని జగన్ దగ్గర పంచాయతీ పెట్టారు దువ్వాడ. దీంతో సానుభూతి దువ్వాడ శ్రీనుపై ప్రభావం చూపి ఎలా అయినా ఆయనకు పదవి ఇవ్వాలన్న ఆలోచనలో భాగంగా ఎమ్మెల్సీ ఇచ్చారు. అదేవిధంగా భార్యకు జెడ్పీ పీఠం ఇవ్వాలనుకున్నా, దువ్వాడ శ్రీను కారణంగానో మరో కారణంగానో అర్ధంతరంగా ఆ  ఆలోచనను విరమించుకుంది అధిష్టానం. ఇదొక్కటీ మినహాయిస్తే ఇప్పుడు రాజకీయ చదరంగంలో ఆ దంపతులు ఇద్దరూ దూసుకుపోతున్నారు. జెడ్పీటీసీగా వాణి ఇకపై తన గొంతు వినిపించనున్నారు. అచ్చెన్నను నేరుగా ఢీ కొననున్నారు. గతంలో ఓ సారి ఆమె జెడ్పీటీసీగా పనిచేశారు. ఇప్పుడు మళ్లీ తన గొంతుకను స్థానిక సమస్యలను వినిపించేందుకు ఉపయోగించనున్నారు.  

టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు చుక్కలు చూస్తున్నారు. టీడీపీకి ఏనాడూ అడ్డంటూ లేని నియోజకవర్గంలో ఇప్పుడాయ న  ఎదురుగాలిని తట్టుకోలేకపోతున్నారు. దీంతో పార్టీ శ్రేణులు కూడా తీవ్ర నిరాశలో ఉన్నాయి. వచ్చే ఎన్నికల వరకూ పార్టీని లైవ్ లో ఉంచడం అన్నది చాలా కష్టంతో కూడుకుని ఉన్న పని అని కూడా తేలిపోయింది. దీంతో ఏం చేస్తే సమస్య పరిష్కారం అవుతుం దో అన్న డైలామా లో పడిపోయింది. పార్టీ తరఫున ధర్నాలూ నిరసనలూ ఉన్నా అవేవీ పెద్దగా ప్రభావం చూపడం లేదు. తాజాగా టెక్కలి ఎంపీటీసీగా దువ్వాడ వాణి గెలుపుతో అచ్చెన్నకు మరో ఎదురు దెబ్బ తగిలింది. గతంలో మాదిరిగా రాజకీయాలు నడప డం ఇప్పుడక్కడ సాధ్యం కాదు. దువ్వాడ వాణి కూడా చాలా మంచి  నాయకురాలిగా పేరు తెచ్చుకున్నవారు. భర్తకు అండగా ఉం టూనే రాజకీయ వ్యూహాలు అమలు చేయగల ధీశాలి. ఇప్పుడక్కడ రాజకీయం మరింత వేడెక్కనుంది. వాస్తవానికి ఈమెకే జెడ్పీ పీఠం కూడా వరించాల్సి ఉంది కానీ  ఆఖరి నిమిషంలో సమీకరణాలు మారడం దృష్ట్యా ఆ అదృష్టం లేకపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: