త‌ప్పులపై త‌ప్పులు.. టీడీపీలో అంత‌ర్మ‌థ‌నం.. ఎందుకు?

VUYYURU SUBHASH
ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీలో ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ప‌రిణామాల‌పై అంత‌ర్మ‌థ‌నం ఎక్కువైందా?  ప్ర‌స్తుత ప‌రిణామాల‌పై.. సీని య‌ర్ల నుంచి తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయా?  ఇలా ఉంటే ఎలా బాబూ..? అని నాయ‌కులు అంత‌ర్గ‌త సంభాష‌ణ‌ల్లో వాపో తున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. గ‌డిచిన వారంలో జ‌రిగిన ప‌రిణామాల‌పై టీడీపీ అదినేత చంద్ర‌బాబు తాజాగా నిర్వ‌హించిన అంత‌ర్గ‌త స‌మావేశంలో సీనియ‌ర్లు ఒక్క పెట్టున పార్టీపై విరుచుకుప‌డ్డార‌ని విశ్వ‌స‌నీయ స‌మాచారం. ఒక‌టి.. ప‌రిష‌త్ ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై టీడీపీ నాయ‌కులు స్పందించిన తీరును సీనియ‌ర్లు త‌ప్పుబ‌ట్టారు.అ దేస‌మ‌యంలో మాజీ మంత్రి అయ్య‌న్న‌ వ్యాఖ్య‌లు.. త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల‌పై స్పంద‌న కూడా స‌రిగాలేద‌ని.. వ్యాఖ్యానించిన‌ట్టు స‌మాచారం.
అదేస‌మ‌యంలో పార్టీలో ఈ ప‌రిస్థితి ఇబ్బందిక‌రంగా మారింద‌ని ఎక్క‌వ మంది నాయ‌కులు అభిప్రాయ‌ప‌డ్డారు. ``ప‌రిష‌త్ ఎన్నిక‌ల‌ను మ‌నం బ‌హిష్క‌రించాం. సో.. ఫ‌లితాలు ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. మౌనంగా ఉంటే స‌రిపోయేది. దీనిపై స్పందించి త‌ప్పు చేశాం`` అని తూర్పుగోదావ‌రి జిల్లాకు చెందిన సీనియ‌ర్ మాజీ మంత్రి ఒక‌రు వ్యాఖ్యానించార‌ని గుస‌గుస వినిపిస్తోంది. అదేవిధంగా సీమ ప్రాంతంలో పార్టీ ప‌టిష్ఠంగా ఉంద‌ని.. ఇప్ప‌టి వ‌ర‌కు ధీమా వ్య‌క్తం చేశామ‌ని.. కానీ.. ఇప్పుడు ప‌రిస్థితి మారిపోయింద‌ని.. చాలా మంది అభిప్రాయ ప‌డ్డార‌ని స‌మాచారం. ``మ‌ని ప్ర‌త్య‌క్షంగా ఎన్నిక‌ల‌ను బ‌హిష్క‌రించాం. కానీ.. బీఫారాలు ఇచ్చాం క‌దా.. మ‌న నాయ‌కులు చాలా మంది త‌మ ప‌రివారాన్ని నిల‌బెట్టి ప్ర‌చారం చేశారు క‌దా! ఇప్పుడు ఫ‌లితం నుంచి త‌ప్పుకోవ‌డాన్ని ప్ర‌జ‌లు కూడా హ‌ర్షించ‌డం లేదు`` అని ఎక్కువ మంది నాయ‌కులు చెప్పిన‌ట్టు తెలిసింది.
ప‌రిష‌త్ ఫ‌లితంపై మ‌నం కూడా అంత‌ర్గ‌త ఆత్మ ప‌రిశీల‌న చేసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌నినాయ‌కులు చంద్ర‌బాబుకు సూచించి న‌ట్టు తెలిసింది. అంతేకాదు.. మ‌రికొంద‌రు నాయ‌కులు ప‌రిష‌త్ ఎన్నిక‌ల‌ను బ‌హిష్క‌రించి త‌ప్పు చేశామ‌ని.. బాబు వ‌ద్ద కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు తెలిపారు. ``మ‌ని ప‌రిష‌త్ ఎన్నిక‌ల‌ను అంచ‌నా వేయ‌డంలో విఫ‌ల‌మ‌య్యారు.అ ప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన స్థానిక ఎన్నిక‌లను, తిరుప‌తి ఉప ఎన్నిక‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని.. కానీ.. ప‌రిష‌త్‌లో పోటీ చేసి ఉంటే.. ఫ‌లితం వేరేగా ఉండేది. మీరు పిలుపు ఇవ్వ‌క‌పోయినా.. మేం పోరాడం.. మంచి ఓట్లే ల‌భించాయి. చాలా చోట్ల వైసీపీ అతి త‌క్కువ మెజారిటీతో ఎంపీటీసీలు, జ‌డ్పీటీసీలు ద‌క్కించుకుంది. మ‌నం పుంజుకునే అవ‌కాశం కోల్పోయాం`` అని గుంటూరుకు చెందిన మాజీ మంత్రి ఒక‌రు.. వ్యాఖ్యానించార‌ని స‌మాచారం.
ఇక‌, అయ్య‌న్న విష‌యంలో నాయ‌కుల‌ను క‌ట్ట‌డి చేయాల్సిందేన‌ని.. అంత‌ర్గ‌త స‌మావేశంలో అంద‌రూ ముక్త‌కంఠంతో చెప్ప‌డం గ‌మ‌నార్హం. ``మ‌న నాయ‌కుడే అయినా.. ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం వ‌ల్ల‌.. ప్ర‌జ‌ల్లోకి ఎలాంటి సందేశం వెళ్తుందో మ‌నం ఆలోచించుకోవాలి. దీనిపై మ‌నం ఎదురు దాడి చేస్తున్నా.. డ్యామేజీ అయితే.. బాగానే జ‌రిగింది. అయ్య‌న్న‌కు వార్నింగ్  ఇవ్వాల్సిందే.. `` అని మాజీ పోలీసు అధికారి.. ప్ర‌స్తుతం పోలిట్ వబ్యూరోలో ఉన్న ఒక నేత వ్యాఖ్యానించిన‌ట్టు తెలిసింది. అదేస‌మ‌యంలో యువ‌త చేజారి పోతున్నార‌ని.. వారిని తిరిగి సైకిల్ ఎక్కించే ప్ర‌య‌త్నాలు సాగించాల‌ని.. ఎక్కువ మంది సూచించారు. మొత్తంగా చూస్తే.. జ‌రిగిన ప‌రిణామాల‌పై టీడీపీ అంత‌ర్మ‌థ‌నం చెందుతోంద‌నేది వాస్త‌వం అంటున్నారు ప‌రిశీల‌కులు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: