బీజేపీ గెలిచింది : తుమ్మపాల చెరకు రైతుకు తీపి కబురు
రాష్ట్రంలో ప్రాతినిధ్యం కోసం పాకులాడుతున్న బీజేపీ తూర్పు ప్రాంతం నుంచి ఆశావహ ఫలితం ఒకటి అందుకుంది. అంతేకాదు ఇదే తూర్పు ప్రాంతం నుంచి నిరసనలూ అందుకుంటోంది. అదే విడ్డూరం. స్టీల్ ప్లాంట్ ఉద్యమం ఓ వైపు, తుమ్మపాల చక్కెర కర్మాగారం సరిగా నడవక, బకాయిలు చెల్లించక మరోవైపు ఆవేదన స్థితిలో ఉన్న సమయంలో బీజేపీ అనుకూల ఫలితం అందుకుంది. ఈ ఫలితం చిన్నదా పెద్దదా లేదా రేపటి వేళ దీని ప్రభావం ఏంటన్నది ఆలోచిస్తే మంచి చేయాలనుకున్నవారు కనీసం మాట్లాడినా చాలు. చాలా కాలంగా తుమ్మపాల సమస్య వెన్నాడుతోంది కనుక ఇక్కడి నుంచే బీజేపీ తన ప్రాబల్యం నిలుపుకుంది కనుక ఆ పాటి సాయం అయినా కేంద్రం రాష్ట్రానికి చేస్తుందని అనుకోవడం అత్యాశే అవుతుంది. అయినప్పటికీ తుమ్మపాల ఎంపీటీసీ విజయం స్థానికంగా బీజేపీ చురుకుదలకు ఉపయోగపడుతుందేమో కానీ ప్రజా సమస్యల పరిష్కారం పై దారి చూపదని కొందరు అంటున్నారు. ఈ నేపథ్యంలో మరిన్ని వివరాలివి. చదవండిక..
స్థానిక ఎన్నికల్లో ఉత్తరాంధ్ర నుంచి తుమ్మపాల - 5 ఎంపీటీసీ స్థానాన్ని బీజేపీ గెలుచుకుంది. అంటే ఇది బోణి అన్న మాట. వి శాఖ జిల్లాకు చెందిన తుమ్మపాల చెరకు ఫ్యాక్టరీ ఎప్పటి నుంచో పెద్దగా యాక్టివ్ గా లేదు. గత ఏడాదిలో సీజన్ వచ్చేటప్పటికీ మూత లోనే దాదాపు ఉంది. క్రషింగ్ లేదు. ఇక్కడ స్థానిక పోరులో బోణీ కొట్టడంతో చెరకు రైతుకు ఏమయినా ప్రయోజనం ఉం టుందా అం టే పెద్ద ప్రశ్నే. ఏదేమైనప్పటికీ మార్పు ఒక్కరితోనే మొదలవుతుంది కనుక బీజేపీ నుంచి గెలిచిన ఆ అభ్యర్థి ఇక్కడి రైతుల గురించి మాట్లాడితే ఎంతో బాగుంటుంది.