చిన్నారి చైత్ర : ఓయూ జేఏసీ మాట విన్న పవన్!
సమాజం నుంచి మార్పు. సమాజంలో మార్పు. ఇలాంటివి కోరుకోవడంలో తప్పు లేదు. ఎన్నో ఏళ్లుగా ఓయూ జేఏసీ ఇదే కోరు తోంది. సర్ మీరు రండి వీళ్లతో మాట్లాడండి అని కోరుకోవడం తప్పు కాదు. పవన్ వెళ్లి బాధితులతో మాట్లాడక వచ్చే మార్పు కాస్త యినా బాధిత వర్గాలకో ఊరట. ఇవాళ షర్మిల మాట్లాడిన విధంగానో, దీక్ష చేసిన విధంగానో పవన్ స్పందించడు. ఆయనకున్న పరి ణితి షర్మిలకు లేదు అని తప్పక చెప్పగలను. ఇప్పుడు అక్కడ దీక్షలేంటి?ఏదయితేనేం పొలిటికల్ మైలేజీ కోరుకునే మనుషులు అలానే ఉంటారు అని మరో మారు తేలిపోయింది.
ఓయూ జేఏసీ ఈ బాధిత కుటుంబానికి ఇలానే మద్దతుగా మున్మందూ ఉండాలి.ఇక చిన్నారి చైత్ర ఎక్కడుంది. మన జీవితాల్లో ఉంది సర్..మన దుఃఖంలో కూడా ఉంది సర్..బాధిత కుటుంబాలకు అండగా ఉండం డి అ ని పవన్ ను అడిగారు కొందరు కుర్రాళ్లు. బాధిత కుటుంబాన్ని తాను పరామర్శించి, ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసు వ్యవ స్థ అప్రమత్తమవ్వాలని కోరుకున్నారు పవన్. చిన్నారి తల్లీ తండ్రీ వీరిద్దరిని ఓదార్చేంత శక్తి ఏ రాజకీయ నాయకుడుకూ ఉం డదు కానీ మాట్లాడితే సమస్యలు పరిష్కారం కావు. మాట్లాడే చొరవ ఒకటి లేకుండా రాజకీయాలు చేయడం తగదు. ఏమయినా నింది తుడు రాజు ఈ అర్ధరాత్రిలోగా పట్టుబడతాడు అని చెబుతున్నారు. పట్టుబడితే మీరు ఎన్కౌంటర్ చేయండి అని చెబుతు న్నారు పౌర సమాజంలోని సభ్యులు. అన్నింటికీ చంపడమే న్యాయమా అంటే న్యాయం అన్యాయం తేలేలోగా మరిన్ని దారుణాలు వస్తున్నాయే ? వాటిపై ఎవరు ఎవరిని నిలదీయాలి.?