గజ్వేల్ సభపై కాంగ్రెస్ ఫోకస్ పెడుతుందా..?

MOHAN BABU
ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన గజ్వేల్ లో నిర్వహించాల్సిన సభ పై కాంగ్రెస్ దృష్టి పెట్టింది. పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా ఫాలోయింగ్ ఎలా ఉన్న అసలైన సత్తాను ఈ నెల 17న జరిగే దళిత గిరిజన దండోరా సభలో చూపించాలనుకుంటుంది. దీని సక్సెస్ చేసి అధికార పార్టీకి షాక్ ఇవ్వాలి అనుకుంటుంది. ఇందుకోసం భారీ స్థాయిలో ప్లాన్ జరుగుతున్నది. సమిష్టి కృషితో విజయవంతం చేయడం కోసం గాంధీభవన్ లో విస్తృతంగా చర్చించాలనుకుంటుంది. పీసీసీ మాజీ చీఫ్ లతోపాటు సీనియర్ నేతలందరితో సోమవారం సమావేశం కానున్నది. రాహుల్ గాంధీని ఆహ్వానించిన హాజరు కావడంపై ఇప్పటివరకు క్లారిటీ రాలేదు.


మరోవైపు రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికి, తాజా రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా కార్యాచరణ, రూపకల్పన,రోడ్ మ్యాప్ తయారీపై రాజకీయ వ్యవహారాల కమిటీ ఏర్పాటైంది. రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో దళిత గిరిజన దండోరా సభలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ఇంద్రవెల్లి నుంచి మొదలు పెట్టింది. ఈ నెల 17న గజ్వేల్లో సభ జరగనున్నది. ఇందుకోసం పార్టీలోని వర్గాలు, గ్రూపులకు అతీతంగా సమిష్టిగా విజయవంతం చేయడం పైన, పార్టీ శ్రేణులు భారీ స్థాయిలో అక్కడికి తరలించడం పైన, నిర్వహణ పైన,సీనియర్ల సలహాలు,సహకారాన్ని తీసుకోనున్నది. గాంధీ భవన్ లో సోమవారం సమావేశమై సమిష్టి సహకారం తో నభూతో తరహాలో నిర్వహించాలని భావిస్తున్నది. పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, విహెచ్ తదితర సీనియర్ నేతలందరినీ ఈ సమావేశానికి ఆహ్వానించింది.


రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయిన తర్వాత అంటీ ముట్టనట్లు గా ఉన్నా జీవన్ రెడ్డి,జానా రెడ్డి తదితరులను కూడా ఈ మీటింగ్ కు పిలిచింది. మరోవైపు ఎన్ఎస్ యు ఐ, యూత్ కాంగ్రెస్ లాంటి విభాగాల నుంచి కూడా శ్రేణులను గజ్వేల్ సభకు తరలించడానికి  ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎక్కడికక్కడ స్థానికంగా పార్టీల నేతలు శ్రేణులతో సమావేశం అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: